Friday, September 20, 2024
HomeతెలంగాణPrakash Ambedkar: జమ్మికుంటలో అంబేద్కర్ మనవడు ప్రకాష్ అంబేద్కర్

Prakash Ambedkar: జమ్మికుంటలో అంబేద్కర్ మనవడు ప్రకాష్ అంబేద్కర్

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతిని జమ్మికుంట పట్టణంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన అంబేద్కర్ మనవడు ప్రకాష్ యశ్వంత్ అంబేద్కర్ మోతులగూడెం చౌరస్తా వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయనకు మున్సిపల్ చైర్మన్ తక్కల్లపల్లి రాజేశ్వరరావు, వైస్ చైర్మన్ దేశిని స్వప్న కోటి, స్థానిక కౌన్సిలర్ ఆధ్వర్యంలో పుష్పగుచ్చం అందించి శాలువా కప్పి ఘన స్వాగతం పలికారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో మంత్రి గంగుల కమలాకర్, ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి, రాష్ట్ర ఎస్సి కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్, జెడ్పిటిసి సభ్యుడు శ్రీరామ్ శ్యామ్, స్థానిక కౌన్సిలర్లు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News