తెలంగాణ రాష్ట్ర పోలీసులు ఇటీవల ఒక కొత్త రకం సైబర్ కైమ్‌ను వెలికి తీశారు. దేశంలో ఈ స్థాయి “సైబర్ నేరం జరగడం ఇదే మొదటిసారని పోలీసులు భావిస్తున్నారు. ఇరవై నాలుగు రాష్ర్టాలకు చెందిన 66.9 కోట్ల మందికి, సంస్థలకు సంబంధించిన డాటాను కొల్లగొట్టడం జరిగింది. నిజంగా ఇది ఒళ్లు గగుర్పొడిచే సంఘటన. ఇది యావద్భారత దేశాన్ని ఉలిక్కిపడేటట్టు చేసింది. ఈ సంఘటనలో ఎడ్యుటెక్ కంపెనీలు, వివిధ సేవా సంస్థలు, డిజిటల్ పేమెంట్ అప్లికేషన్స్, ఇ-కామర్స్ వెబ్‌సైట్లు, బ్యాంకులు, మ్యూచువల్ ఫండ్స్, ఇంధన సంస్థలు, విద్యుత్ సంస్థలు, ఆర్.టి.ఓలు, ఆర్మీ అధికారులకు సంబంధించిన డాటా చోరీ అయింది. (ప్రాథమికంగా తేలిందేమిటంటే, ఇదంతా ఒకే వ్యక్తి చేతుల మీదుగా జరిగిన వ్యవహారం కాదు. వినయ్ భరద్వాజ్ అనే వ్యక్తి “ఇన్‌స్పైర్ వెబ్స్” అనే వెబ్‌సైట్ ద్వారా తన క్లెయింట్లకు ఆ డాటాను విక్రయిస్తున్నట్టు తెలిసింది. చాలామంది ఈ విధంగా ఆన్‌లైన్ మోసగాళ్ల బారిన పడడం భారత్‌తో సహా అనేక దేశాలలో సర్వసాధారణ విషయమే. కానీ, బడా సంస్థల సమాచారాన్ని ఈ విధంగా నేరస్థులు కొల్లగొట్టడం మాత్రం అసాధారణ విషయంగా కనిపిస్తోంది. నిజానికి, ఈ వ్యవహారం ఎలా జరిగిందో ఈ సంస్థలే వివరణ ఇవ్వాల్సి ఉంటుంది.
దేశ ప్రజలు, దేశంలోని సంస్థలు ఎలా సైబర్ మోసాలకు గురవుతున్నాయో పరిశీలిస్తే, ఈ మోసాలు ఎంత పకడ్బందీగా, ఎంత అధునాతనంగా జరుగుతున్నాయో అర్ధం అవుతుంది. సుమారు 20 లక్షల “సైబర్ నేరాల కేసులు ప్రస్తుతం దర్యాప్తు సంస్థల పరిశీలనలో ఉన్నాయని (ప్రభుత్వ గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఇందులో ఎన్ని కేసులలో దర్యాప్తు పూర్తయింది, ఎంతమందిని అరెస్టు చేయడం జరిగింది, ఎంత మందికి శిక్షపడింది అన్నది మాత్రం అంతుచిక్కడం లేదు. సుమారు 500 ఆన్‌లైన్ యాప్స్‌ను నిషేధించడం జరిగింది. ఇక సైబర్ నేరాలకు సంబంధించినంత వరకూ ప్రపంచ దేశాలలో భారత్ మూడవ స్థానంలో ఉందని తెలిసింది. అధిక శాతం సైబర్ నేరాలు వివిధ దేశాల సంస్థల మధ్య జరుగుతున్న వ్యవహారాలు. ఇటువంటి వ్యవహారంలో సంస్థాగతంగా ఏమీ చేయలేని పరిస్థితిని నేరస్థులు అవకాశంగా తీసుకుంటున్నారు. కేవలం డాటాను చోరీ చేయడమే కాకుండా, వీటికి సంబంధించి అనేక నేరాలకు తేలికగా ఒడిగడుతున్నారు. ఈ సైబర్ నేరాల వ్యాప్తిని, విజృంభణను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం చాలా కాలం క్రితమే “ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్”, ‘నేషనల్ క్రిటికల్‌ఇన్ఫర్మేషన్ ఇన్‌ప్రాస్టక్చర్ ప్రొటెక్టన్ సెంటర్’లను |ప్రారంభించింది.
ఇక, గత ఏడాది అఖిల భారత వైద్య విజ్ఞానాల సంస్థ (ఏ.ఐ.ఐ.ఎం.ఎస్)పై సైబర్ దాడి జరగడం, ఆరు రోజుల పాటు ఈ సంస్థ కార్యకలాపాలు స్తంభించిపోవడం వంటివి చోటు చేసుకున్న నేపథ్యంలో కేంద్రప్రభుత్వం ‘నేషనల్ కౌంటర్ రాన్‌సమ్ టాస్క్ ఫోర్స్”ను కూడా ఏర్పాటు చేసింది. అయితే, అనేక రాష్ర్టాలలో సైబర్ నేరాలను అరికట్ట గలిగిన వ్యవస్థలు గానీ, యంత్రాంగం గానీ లేకపోవడం వల్ల ఈ విషయంలో మరింత ముందుకు వెళ్లగలిగే అవకాశం కనిపించడం లేదు. తెలంగాణ రాష్ట్రం ఇందుకు మినహాయింపనే చెప్పాలి. ఇక్కడ అత్యంత ఆధునిక కమాండ్ ఫోర్స్‌ను ఏర్పాటు చేయడం జరిగింది. కొత్తగా “స్టేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో” ఒకటి ఏర్పాటయింది. అంతేకాదు, సైబర్ భద్రతను బలోపేతం చేసే ఉద్దేశంతో “సెంటర్ ఫర్ ఎక్సలెన్స్’ను కూడా ఏర్పాటు చేశారు. అయినప్పటికీ 2020-21 మధ్య తెలంగాణ రాష్ట్రంలో సైబర్ నేరాలు వంద శాతం పెరిగాయి, ఇంటర్‌నెట్ వినియోగంలో చైనా తర్వాత భారత్ రెండవ స్థానం ఆక్రమించినందు వల్ల దేశంలో సైబర్ నేరాలు మరింతగా పెరిగే అవకాశమే ఉంది తప్ప తగ్గే అవకాశం లేదు.
ప్రస్తుతం సైబర్ నేరాలను ఐ.టి చట్టం, ఐ.పి.సిల కింద విచారించడం జరుగుతోంది. బహుశా కేంద్ర ప్రభుత్వం త్వరలో పర్సనల్ డాటా (ప్రొటెక్షన్ బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉంది. చట్టాలు ఎలా ఉన్నప్పటికీ మనం సామర్థ్య నిర్మాణం మీద దృష్టి పెట్టడం మంచిది. యుద్ద (ప్రాతిపదిక మీద (ప్రజల్లో అవగాహనను, చైతన్యాన్ని కలిగించడం కూడా చాలా అవసరం, (టైవేట్ కంపెనీలు, ప్రభుత్వ కంపెనీలు, ఇతర సంస్థలు తప్పనిసరిగా తమకంటూ స్వయంగా సైబర్ భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. చట్టాలు పటిష్టంగా పనిచేయాలన్నా ఈ వ్యవస్థలు తప్పనిసరి, ప్రారంభదశలోనే ఈ నేరాలకు కళ్లెం వేయాల్సి ఉంటుంది. ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా ఇది దేశ భద్రతకు, దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా ముప్పు తెచ్చే ప్రమాదం ఉంది.