Friday, November 22, 2024
Homeనేషనల్Psychiatric Disorder : యువకుడి పొట్టలో 187 నాణేలు.. అవాక్కైన వైద్యులు

Psychiatric Disorder : యువకుడి పొట్టలో 187 నాణేలు.. అవాక్కైన వైద్యులు

తరచూ వాంతులు, పొత్తికడుపులో నొప్పిగా ఉందంటూ ఓ యువకుడు ఆస్పత్రికి వెళ్లాడు. అతనికి కడుపులో రావడానికి గల కారణం తెలుసుకునేందుకు ఎక్స్ రే తీసిన వైద్యులు అవాక్కయ్యారు. అతని కడుపులో పెద్దమొత్తంలో నాణేలు కనిపించడమే అందుకు ప్రధాన కారణం. ఈ అసాధారణ ఘటన కర్ణాటకలో వెలుగులోకి వచ్చింది. భాగల్ కోట్ జిల్లాకు చెందిన ఓ యువకుడు ఇటీవల వాంతులు, పొత్తికడుపులో నొప్పితో ఇబ్బంది పడుతున్నాడు. ఎంతకీ నొప్పి తగ్గకపోవడంతో కుటుంబ సభ్యులు హనగల్ లోని పెద్దాసుపత్రికి తీసుకెళ్లారు.

- Advertisement -

ఆ యువకుడిని పరీక్షించిన వైద్యులు అతనిపొట్టలో పెద్దసంఖ్యలో నాణేలు ఉన్నట్లు తేల్చారు. ఆపరేషన్ చేసి, రెండు గంటలపాటు శ్రమించి నాణాలన్నీ బయటకు తీశారు. వాటిని లెక్కించగా.. మొత్తం 187 నాణాలు ఉన్నాయని వైద్యులు చెప్పారు. ఒక్క నాణెం కడుపులోకి వెళ్తేనే ఇబ్బందిగా ఉంటుంది. అలాంటిది ఏకంగా 187 నాణాలు ఆ యువకుడి కడుపులోకి ఎలా వెళ్లాయని వైద్యులు ఆరా తీశారు. దీంతో సదరు యువకుడు మానసిక సమస్యతో బాధపడుతున్నాడని తేలిందని వివరించారు. కనిపించిన ప్రతి నాణేన్ని గుటుక్కుమనిపించేవాడని తెలిపారు. ప్రస్తుతం బాధితుడు కోలుకుంటున్నాడని వైద్యులు పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News