తాండ్రపాడు నుండి గార్గేపురం వరకు నిర్మాణం చేస్తున్న హైవే రోడ్డుకు కావలసిన భూములు సేకరిస్తూ భూములు కోల్పోయిన రైతులకు న్యాయమైన నష్టపరిహారం ఇవ్వాలని ఏపీ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి రామకృష్ణ కోరారు. ఈ మేరకు సోమవారం జిల్లాకు వచ్చిన నూతన కలెక్టర్కు రైతులతో కలిసి వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఉన్న కలెక్టర్కు, ఆర్డిఓకు, ఎమ్మార్వో కు వినతి పత్రాలు ఇవ్వడం ఆందోళనలు చేసినప్పటికీ న్యాయం చేయలేదని తెలిపారు. సుధీరెడ్డిపల్లి, నూతనపల్లె రైతుల భూములు చాలా విలువైన భూములుగా ఉన్నాయని కోట్ల రూపాయలు విలువ చేస్తాయని వాటికి కేవలం ఎకరాకు 12 లక్షల రూపాయలు మాత్రమే ఇవ్వడం న్యాయం కాదని అన్నారు. కొత్త కలెక్టర్ గారైన దృష్టి సారించి న్యాయమైన నష్టపరిహారం ఇచ్చి రైతులను ఆదుకోవాలని ఆయన కలెక్టర్ ను కోరారు.
కలెక్టర్ సానుకూలంగా స్పందిస్తూ నేను న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. రైతులు మాట్లాడుతూ మాకు న్యాయమైన నష్టపరిహారి ఇవ్వకపోతే మాకు ఆత్మ హత్యలే శరణ్యం అవుతాయని వారు తెలిపారు. హంద్రీనీవా బోరు బావులు మరియు ప్రైవేటు వాళ్లు వెంచర్స్ వేసి ఇళ్ల నిర్మాణం చేయడం వలన మా భూములు చాలా విలువ కలిగిన భూములని రైతులు తెలిపారు. మాకు న్యాయం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. లేని పక్షంలో రైతు సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన పూనుకుంటామని తెలిపారు.