Saturday, June 21, 2025
Homeఆంధ్రప్రదేశ్YSR Bima: వైయస్సార్ బీమా తక్షణ సహాయం అందజేత

YSR Bima: వైయస్సార్ బీమా తక్షణ సహాయం అందజేత

నందికొట్కూరు నియోజకవర్గంలోని పగిడ్యాలలో నివాసం ఉంటున్న మాడే పోగు నాగన్న అనే వ్యక్తి కుమారుడు మాడే పోగు జాన్ ఆదివారం గుండె పోటుకు గురై బాధపడుతుండగా, కుటుంబ సభ్యులు మెరుగైన చికిత్స నిమిత్తం హుటాహుటిన నందికొట్కూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ పెరుమాళ్ళ శేషన్న హుటహుటీన మృతుని స్వగృహానికి చేరుకొని మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు .

- Advertisement -

అనంతరం మృతుడి కుటుంబ సభ్యులకు వైయస్సార్ ప్రభుత్వం అందిస్తున్న వైఎస్సార్ భీమా తక్షణ సహాయం కింద రూ.10వేలు అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పెరుమాళ్ళ శేషన్న, ఈఓఆర్డి పుల్లయ్య , వెల్ఫేర్ అసిస్టెంట్ నరసింహులు , పంచాయతీ సెక్రటరీ ఉపేంద్ర రెడ్డి, మంజుల, వాలంటీర్లు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News