Saturday, November 23, 2024
Homeఆంధ్రప్రదేశ్Kodumuru: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను సాగనంపుదాం, దేశాన్ని కాపాడుకుందాం

Kodumuru: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను సాగనంపుదాం, దేశాన్ని కాపాడుకుందాం

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను సాగు నంపుదాం, దేశాన్ని కాపాడుకుందాం అని సిపిఐ మండల కార్యదర్శి రాజు సిపిఐ పట్టణ కార్యదర్శి రాముడు సీఐటీయూ మండల కార్యదర్శి జిపి ఈరన్న అన్నారు. సిపిఐ, సిపిఎం పార్టీల ఆధ్వర్యంలో చేపట్టిన ప్రచార బేరి పాదయాత్ర కోడుమూరు పట్టణంలోని మాల వీధి శాంతినగర్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల బాధలు అవస్థలు అర్థం చేసుకోవడంలేదని ధరలు విపరీతంగా పెంచేసి, ప్రజలు బ్రతకలేని దుస్థితి నెలకొల్పాయని వారు తెలిపారు.

- Advertisement -

కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలన్నిటిని ప్రైవేటుపరం చేస్తూ, అదానిృఅంబానీలకు ఊడిగం చేస్తున్నాయని వారు విమర్శించారు. ప్రజల మధ్య మతవిద్వేషాలను సృష్టిస్తూ మతోన్మాదని రెచ్చగొడుతూ, మరోపక్క ప్రైవేటీకరణను అమలు చేస్తూ, ప్రభుత్వ ఆస్తులన్నిటిని అమ్మి వేయడానికి పూనుకుందని వారి విమర్శించారు.రాష్ట్రంలో నేడు గడ్డు పరిస్థితి ఏర్పడింది రైతులకు పంటలు చేతికి రాక గిట్టుబాటు ధర లేక అనేకమంది అవస్థలు పడుతున్నారని, అలాగే గ్రామాలలో కూలీలు ఉపాధి లేక, ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లి ప్రమాదాలకు గురవుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.దీనికి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే వారి మీద కేసులు బనాయిస్తూ వారిని ఇబ్బందులకు గురి చేస్తూ, నిరంకుశ పరిపాలన కొనసాగిస్తున్నాయని వారు తెలిపారు.

ప్రజలను చైతన్య పరిచే దిశగా ఈ ప్రచార బేరి పాదయాత్ర కార్యక్రమం చేపట్టామని, దీనికి ప్రజలందరూ మద్దతు తెలియజేస్తున్నారని, ప్రజల వద్దకు వెళ్లి ప్రజలకు ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పరిపాలన వివరిస్తూ, ఈ ప్రభుత్వాలకు బుద్ధి చెప్పాలని ఆరు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మోటార్ వర్కర్స్ యూనియన్ నాయకులు గడ్డం నాగరాజు పెద్దయ్య వాసు ఆటో వర్కర్స్ యూనియన్ నాయకులు ఓబులేసు హమాలి సంఘం నాయకులు సుంకన్న నాగరాజు ప్రజానాట్యం మండలి నాయకులు మద్దూరు రాముడు చేనేత సంఘం నాయకులు గంగాధరు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News