రాష్ట్ర,కేంద్ర పాలనలో ప్రజా వ్యతిరేక విధానాల అవలంబిస్తున్న వైసిపి,బిజెపి ప్రభుత్వాలను తరిమికొట్టేందుకు ప్రజలు చైతన్యవంతం కావాలని సిపిఐ మండల కార్యదర్శి బసాపురం గోపాల్ సూచించారు. మండలంలోని ఆరెకల్,బైచిగేరి, ధనాపురం,నాగనాతన హల్లి, నారాయణపురం,చాగి గ్రామాలలో సిపిఐ,సిపిఎం తలపెట్టిన ప్రచార బేరి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ,సిపిఎం మండల కార్యదర్శిలు బసాపురం గోపాల్,లింగన్న మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి ప్రభుత్వం మతతత్వ ఘర్షణలు సృష్టిస్తూ ప్రజా వ్యతిరేక శక్తులను పెంచి పోషిస్తుందని వ్యాఖ్యానించారు.
బిజెపి ప్రభుత్వం మోదీ నాయకత్వంలో దేశం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందని చెప్పుకొచ్చారు. ప్రజాధనాన్ని కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తూ నిరుపేదలకు అన్యాయం చేస్తుందని కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయంపై నిప్పులు చేగిరారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం సామాన్య ప్రజల భూములపై భూ కబ్జాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ప్రశ్నిస్తే భౌతిక దాడులు చేయించడం,అక్రమ కేసులను బనాయించడం వైసిపి ప్రభుత్వంలో మితి మిరిపోయాయని వాపోయారు.
. వైసీపీ ప్రభుత్వానికి మరో అవకాశం ఇస్తే సామాన్య ప్రజల సొంత ఆస్తులు కూడా తాకట్టు పెట్టే దౌర్భాగ్య పరిస్థితి రాష్ట్రంలో దాపురించి ఉందని చెప్పుకొచ్చారు. ఇప్పటికైనా ప్రజలు మేల్కోకపోతే రాబోయే భవిష్యత్ తరానికి తీవ్రమైన ఎడారి లాంటి ఆర్థిక సంక్షోభం సంభవిస్తుందని తెలియజేశారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో బిజెపి వైసిపి పార్టీలకు గుణపాఠం చెప్పాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో కార్యదర్శి అంజిత్ గౌడ్ పట్టణ అధ్యక్షుడు పాల్గొన్నారు.