Saturday, October 5, 2024
HomeతెలంగాణGudem Mahipal: మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట

Gudem Mahipal: మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట

జిహెచ్ఎంసి పరిధిలోని డివిజన్లలో మౌలిక వసతుల కల్పనకు పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. పటాన్చెరు డివిజన్ పరిధిలోని అంబేద్కర్ కాలనీలో 25 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న సిసి రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే జిఎంఆర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పటాన్చెరు డివిజన్ పరిధిలో ఇప్పటికే ఐదు కోట్ల రూపాయల అంచనా వ్యయంతో సిసి రోడ్ల నిర్మాణ పనులు చేపట్టామని తెలిపారు. రోడ్లతో పాటు యూజీడీలు, మిషన్ భగీరథ, పరిశుభ్రత పచ్చదనం పెంపొందించేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, జిహెచ్ఎంసి డిప్యూటీ కమిషనర్ బాలయ్య, బి ఆర్ ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అఫ్జల్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News