Thursday, September 19, 2024
Homeనేషనల్Aurangabad: బీఆర్ఎస్ జిందాబాద్ అంటున్న ఔరంగాబాద్

Aurangabad: బీఆర్ఎస్ జిందాబాద్ అంటున్న ఔరంగాబాద్

కాంగ్రెస్ , బీజేపీ ల వికృత విధానాలతో విసిగిపోయిన ఔరంగబాద్ జిల్లా ప్రజలు తెలంగాణ మోడల్ ను స్వాగతిస్తూ బీఆర్ఎస్ కు జిందాబాద్ కొడుతున్నారు. ఔరంగబాద్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్, బీజేపీ, ఎన్సీపీ, శివసేన పార్టీల నాయకులు, రైతు సంఘాల ప్రతినిధులు బీఆర్ఎస్ లో చేరడానికి క్యూ కడుతున్నారు. ఛత్రపతి శంబాజీనగర్ (ఔరంగబాద్) పట్టణంలో జరిగిన కార్యక్రమంలో ముస్లిం మైనారిటీలు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీలో చేరారు. చేరిన వారిలో ముదస్సిర్ అన్సారీ (MIM పార్టీ ఔరంగబాద్ పట్టణ అధ్యక్షుడు), అర్షద్ అహ్మద్, మతీమ్ ఖాన్,సాలీ చౌస్,హుజేఫ్,అమీర్,షేక్ సిరాజ్,సల్మాన్ అలీ షేర్,జియఉద్దీన్ పటేల్,అస్లాం పటేల్,షేక్ షఫెయ్,జునైద్ ఖాన్,ముజామిల్ అన్సారీ,షఫీమ్ లాల,హాబీబ్ చౌష్,ఎంఎం పాటిల్ &MIM పార్టీకి చెందిన ముఖ్య నాయకులు,కార్యకర్తలు చేరారు. నాయకులు, కార్యకర్తలు,వందలాది మంది మైనార్టీలు బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.

- Advertisement -

పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి వారి మెడలో గులాబీ కండువా వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈసందర్భంగా మైనార్టీ నేతలు మాట్లాడుతూ అధ్బుతంగా ఉన్న తెలంగాణ మోడల్ మహారాష్ట్ర లోనూ అమలు జరపాలన్న ఆకాంక్ష వ్యక్తం చేశారు. 24న ఔరంగబాద్ లో జరగనున్న కేసీఆర్ సభకు కదం తొక్కుతామని వారు హామీ ఇచ్చారు.

తెలంగాణ పథకాల ను దేశవ్యాప్తం చేస్తాం-జీవన్ రెడ్డి

ఇదిలావుండగా మహారాష్ట్రలోని ఛత్రపతి శంబాజీనగర్(ఔరంగబాద్)పట్టణంలో జరిపిన బీఆర్ఎస్ పార్టీ సన్నాహక సమావేశంలో జీవన్ రెడ్డి మైనార్టీల నుద్దేశించి ప్రసంగిస్తూ ఈ నెల 24వ తేదీన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సభకు పెద్ద సంఖ్యలో వచ్చి విజయవంతం చేయాలని కోరారు. “తెలంగాణలో మైనారిటీల సంక్షేమానికి బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఈ తొమ్మిదేళ్లలో మైనార్టీల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం రూ.8,581 కోట్లను ఖర్చు చేసి అనేక పథకాలు అమలు చేస్తోంది. ప్రస్తుత రంజాన్ పండుగ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం మైనారిటీ కార్పొరేషన్ ద్వారా పేద ముస్లిం మహిళలకు 20 వేల కుట్టుమిషన్లు ఇవ్వాలని నిర్ణయించింది. ప్రతీ ఏటా రంజాన్‌ కానుకగా కేసీఆర్ సర్కార్ నిరుపేద ముస్లింలకు గిఫ్ట్‌ ప్యాక్‌లను పంపిణీ చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 815 మసీదు మేనేజింగ్‌ కమిటీలకు ఒక్కో కమిటీకి 500 చొప్పున గిఫ్ట్‌ ప్యాకెట్లను ఇప్పటికే సరఫరా చేసింది.
ముస్లిం మైనారిటీ ఆడపిల్లల కోసం ఇచ్చే షాదీ ముబారక్‌ ద్వారా 2,32,713 మంది పెళ్లిళ్లకు 2022 డిసెంబరు నాటికి రూ.1,903 కోట్లను ఖర్చు చేసింది. ఇక మైనారిటీ విద్యార్థుల కోసం రాష్ట్రవ్యాప్తంగా 408 గురుకుల విద్యాసంస్థలను నెలకొల్పింది.
ముఖ్యమంత్రి విదేశీ విద్య స్కాలర్‌షిప్‌ పథకం కింద విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించే అర్హులైన మైనారిటీ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.20 లక్షల గ్రాంటును అందిస్తోంది. ఇందులో భాగంగా 2022 డిసెంబరు నాటికి 2,701 మందికి రూ.435 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది. దేశంలో మైనారిటీలుగా గుర్తింపు పొందిన ముస్లింలకు తెలంగాణ ప్రభుత్వం భరోసానిస్తూ వారి సంప్రదాయాలను, విశ్వాసాలను గౌరవిస్తూ రంజాన్‌ పండగను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది. ప్రతీ ఏటా ఇఫ్తార్‌ విందును ఏర్పాటు చేస్తోంది. ఇక ఏటా ఎకరానికి రూ.10వేల చొప్పున అన్నదాతలకు పెట్టుబడి సాయం అందించే రైతుబంధు, మరణించిన రైతు కుటుంబాలకు 72 గంటలలోగా రూ.5 లక్షల చొప్పున పరిహారం చెల్లించే రైతుబీమా, మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పునరుద్ధరణ, ఒక లక్ష 40వేల కిలో మీటర్ల పొడవున పైపు లైన్లు వేసి ఇంటింటికి మంచి నీటి సరఫరా చేసే మిషన్ భగీరధ, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచిత ప్రసవాలను ప్రోత్సహిస్తూ మగ పిల్లోడు పుడితే రూ. 12వేలు, ఆడపిల్ల పుడితే రూ.13 వేల చొప్పున చెల్లించి శిశు సంరక్షణ కోసం వివిధ వస్తువులతో కేసీఆర్ కిట్ల పంపిణీ, వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా వంటి పథకాలతో మిళితమైన తెలంగాణ మోడల్ ను దేశవ్యాప్తం చేస్తాం. కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న 450 పథకాలతో తెలంగాణ ప్రజల జీవన ప్రమాణాలు గణనీయంగా మెరుగు పడ్డాయి.
బీఆర్ఎస్ సకల జనుల బంధువు, బీజేపీ ప్రజలను పీడించే రాబంధు
మోడీ నకిలీ మోడల్ వద్దు.అసలుసిసలైన కేసీఆర్ మోడలే ముద్దు. ఔరంగబాద్ బీఆర్ఎస్ సభతో మహారాష్ట్ర రాజకీయాలలో మార్పులు జరుగుతాయి” అని జీవన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బోధన్ ఎమ్మెల్యే షకీల్ అహ్మద్, ఐ డీసీ చైర్మన్ వేణుగోపాల చారి,బీఆర్ఎస్ పార్టీ జాతీయ జనరల్ సెక్రెటరీ హిమాన్ష్ తివారీ,సీనియర్ నాయకులు ఖదీర్ మౌలనా, బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News