Friday, September 20, 2024
Homeఓపన్ పేజ్Water scarcity: ప్రపంచవ్యాప్తంగా నీటి కటకట!

Water scarcity: ప్రపంచవ్యాప్తంగా నీటి కటకట!

ప్రపంచవ్యాప్తంగా నీటి సంక్షోభం నెలకొంది. గుక్కెడు నీటికి కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లే దారుణ పరిస్థితులు అనేక దేశాల్లో నెలకొన్నాయి ఆఫ్రికా దేశాల్లో నీటి సమస్య మరింత తీవ్రంగా ఉంది.భారతదేశం కూడా నీటి ఎద్దడికి మినహాయింపు కాదు. మనదేశంలో మరఠ్వాడా సహా అనేక ప్రాంతాల్లో ప్రజలు తాగునీటికి అల్లాడుతున్నారు. ఏప్రిల్‌లోనే దేశంలోని అనేక ప్రాంతాల్లో నీటి ఎద్దడి కనిపిస్తోంది. మే నెల మొదలైతే నీటి కటకట మరింత తీవ్రమవుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
సురక్షిత నీటికి నోచుకోని కోట్లాదిమంది ప్రజలు
మనిషి బతకడానికి ఆహారం ఎంత అవసరమో…నీరు కూడా అంతే అవసరం. మనిషి ఆరోగ్యంగా బతకడానికి సురక్షిత నీరు మరీ ముఖ్యం. సురక్షిత నీరు అందకపోతే మనుషులు రోగాలపాలవుతారు. ప్రాణాలు కొడిగట్టి పో తాయి. ప్రపంచవ్యాప్తంగా సురక్షిత నీటికి కోట్లాది మంది దూరంగా ఉన్నారు. ప్రపంచజనాభాలో దాదాపు 26 శాతం మంది సురక్షిత తాగునీటికి నోచుకోవడం లేదని లెక్కలు తేల్చి చెబుతున్నాయి. ఇంతకంటే దారుణం ఇంకే ముంటుంది? ఐక్యరాజ్యసమితి లెక్కల ప్రకారం మధ్య ఆఫ్రికా, తూర్పు ఆసియా, దక్షిణ అమెరికాలోని కొన్ని ప్రాంతాలు పర్యావరణ మార్పుల కారణంగా సీజన్ల వారీ నీటి కొరతను ఎదుర్కొంటున్నాయి. పశ్చిమాసియా, సహా రా పరీవాహక ప్రాంతాల భవితవ్యం రానున్న రోజుల్లో మరింత దుర్భరం కానుందని నీటి ఎద్దడిపై ఐక్యరాజ్య సమితి తాజా నివేదిక హెచ్చరించింది. నీటి ఎద్దడికి దాదా పుగా ఏ దేశమూ మినహాయింపు కాదు. అయితే నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న జాబితాలో ఆఫ్రికా దేశాలు ముందున్నాయి. ఆఫ్రికాలోని అనేక దేశాల్లో ఇప్పటికీ సురక్షిత మంచినీరు ప్రజలకు అందడం లేదు. అభివృద్ధిలో వెనకబడ్డ దేశాల్లో నీటి కొరత తీవ్రంగా ఉందని లెక్కలు చెబుతున్నాయి.
నీటి ఎద్దడికి కారణాలేమిటి?
ప్రపంచదేశాల్లో నీటి ఎద్దడిపై ఐక్యరాజ్యసమితి ఇటీవల మూడు రోజుల పాటు కీలక సమావేశం నిర్వ హించింది. వాటర్‌ కాన్ఫరెన్స్‌ నిర్వహణకు ముందు యునై టెడ్‌ నేషన్స్‌ వరల్డ్‌ వాటర్‌ డెవలప్‌మెంట్‌ రిపోర్ట్‌ అనేక సంచలన విషయాలను వెల్లడించింది. నీటి ఎద్దడిని నివా రించడానికి అంతర్జాతీయస్థాయిలో బలమైన యంత్రాం గాన్ని రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు నీటిరంగ నిపుణులు. ప్రపంచంలోని ప్రజలందరికీ 2023 నాటికల్లా సురక్షిత తాగునీరు అందించాలని ఐక్యరాజ్యసమితి గతం లోనే లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఆ లక్ష్యానికి ప్రస్తు తం అనేక దేశాలు చాలా దూరంలో ఉన్నాయి. అందరికీ సురక్షిత తాగునీరు అందించాలన్న లక్ష్యానికి చేరుకోవడా నికి ఏడాదికి 600 బిలియన్ల నుంచి ఒక ట్రిలియన్‌ డాలర్ల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుందని నీటిరంగ నిపుణుడు రిచర్డ్‌ కాన్నర్‌ చెప్పారు.అభివృద్ధి పేరుతో పర్యావరణానికి తూట్లు పొడుస్తున్న వైనం, రకరకాల కాలుష్యాలతో పాటు గ్లోబల్‌ వార్మింగ్‌…ఇవన్నీ నీటి ఎద్దడికి ప్రధాన కారణాలని యునైటెడ్‌ నేషన్స్‌ వరల్డ్‌ వాటర్‌ డెవలప్‌మెంట్‌ తాజా నివేదిక తెగేసి చెప్పింది.
2050నాటికి భారత్‌లో తీవ్ర నీటి సంక్షోభం
నీటి విషయంలో భారత్‌లోనూ పరిస్థితి ఏమాత్రం ఆశాజనకంగా లేదు. 2050 నాటికి భారత్‌లో తీవ్రమైన నీటి కటకట నెలకొంటుందని ఐక్యరాజ్యసమితి తాజా నివే దిక తేల్చి చెప్పింది.మనదేశంలో భూగర్భజలాలను అతిగా వినియోగించడమే నీటి ఎద్దడికి ఒక కారణమంటున్నారు సైంటిస్టులు. మోతాదుకు మించి ఉపయోగించడం వల్ల మనదేశంలోని అనేక ప్రాంతాల్లో భూగర్భజలాలు తరిగి పోయాయి. దీనిఫలితంగా దైనందిన అవసరాలకు కూడా నీటి కొరత ఏర్పడింది. గత రెండు దశాబ్దాలలో దేశ వ్యాప్తంగా దాదాపు 300 జిల్లాల్లో భూగర్భజలాల నిల్వలు నాలుగు మీటర్లు తగ్గినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఒక అధ్యయనం ప్రకారం దేశంలో మూడింట రెండు వంతుల మంది భూగర్భజల వనరులను అవసరాలకు మించి విని యోగిస్తున్నట్లు స్పష్టమైంది. భూమిలోకి నీరు ఇంకి పోవడం ఒక సహజ ప్రక్రియ. భూమిలోకి ఎంత ఎక్కువగా నీరు ఇంకితే అంత ఎక్కువగా భూగర్భజలాల నిల్వలు ఉంటాయి.అయితే నేలతల్లిలోకి ఇంకే నీరు కాలక్రమంలో తగ్గిపోయింది. దీంతో భూగర్భజల మట్టాలు ఏడాదికేడాది తగ్గపోతున్నాయి. పాతాళంలో కాసిన్ని నీళ్లుఉన్నా వాటిని కూడా ఎడాపెడా బోర్లు వేసి తోడేస్తున్నాం. ఒకవైపు నీటి ఎద్దడి ఉంటే మరో వైపు ఉన్న నీటిని అవసరాలకు మించి ఎడాపెడా వాడేస్తున్నాం. అంతేకాదు దేశంలోని అనేక ప్రాంతాల్లో ప్రజలు తాగునీళ్లు దొరక్క ఇబ్బందిపడుతుంటే కొన్నిచోట్ల తోటల్లో మొక్కలకు నీళ్లుపోయడానికి తాగు నీటిని ఉపయోగిస్తున్నారు. ఈనేపథ్యంలో నీటిని పునర్వి నియోగించే పద్దతులు కొన్ని ఉన్నాయి. అయితే వీటిని ఎవరూ పట్టించుకోవడం లేదు. వాననాటి యాజమాన్య పద్ధతులపై ప్రజలకు అవగాహన కల్పించాలి. ఆకాశం నుంచి రాలే ప్రతి వానచినుకును అపురూపంగా దాచు కోవాలి. మరింత లోతుగా బోర్లువేసి భూగర్భజలాలను పైకి లాగుతున్నాం. అయితే ఇంత శ్రమించి నీళ్ళ పొందు తున్నాయన్న సంగతిని మరిచి నీటిని దుర్వినియోగం చేస్తున్నాం. తాగడానికి వాడే నీటినే టాయిలెట్లకు, మొక్క లకు వాడేసూ వృథా చేస్తున్నాం. వాడిన నీటికి పునర్విని యోగం పద్ధతులు ఏవీ మనం పాటించడం లేదు. ఒకసారి వాడిన నీరంతా మురికి కాలువలలోకి చేరి పూర్తిగా పనికి రాకుండా పోతుంది. వ్యవసాయంలో కూడా తక్కువ నీటితో పండించే శ్రీవరి విధానాలను పాటించకుండా సాంప్రదాయా పద్ధతులలో వరిసాగు చేసూ వేల నీటిని వృధా చేస్తున్నాం. హోటళ్ళు బహుళ అంతస్తుల భవనాలు నీటి సక్రమ వినియోగం పట్ల దృష్టిపెట్టడం. ఇప్పటికీ మనదేశంలో చాలా ప్రాంతాల ప్రజలు తీవ్రమైన నీటి ఎద్దడితో బాధపడుతున్నారు. భూగర్భ జలాలను కాపాడు కుంటూ, పెంచుకోడానికి రాలే ప్రతి వానచినుకును భద్రం గా దాచుకోవాలి. ఇంకుడుగుంతలు, వాననీటి యాజ మాన్య పద్ధతులు ప్రతి ఒక్కరూ తెలుసుకుని ప్రతి ఇంటిలో అమలు చేయాలి.
ప్రపంచవ్యాప్తంగా తాగునీటికి కటకట
భూగోళంపై 80శాతం నీరు విస్తరించి ఉంది. అయినప్పటికీ తాగడానికి ఉపయోగపడే సురక్షిత నీరు ప్రజలకు దొరకడం లేదు. స్వచ్ఛమైన నీటి లభ్యత మూడు శాతం కంటే తక్కువగా ఉంది. ఎక్కువ శాతం నీరు కలుషి తమై ఉంటుంది. లభించే కొద్దిపాటి శుద్ధజలం మానవ చర్యలవల్ల పనికిరాకుండా పోతోంది. దీని ప్రభావం కేవలం మనుషులపైనే కాదు…. సమస్త ప్రాణికోటి, ము ఖ్యంగా జలచరాలపై కూడా పడుతోంది. నీటి కాలుష్యాన్ని నివారించడానికి తీవ్ర ప్రయత్నాలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. భారతీయ సంస్కృతిలో నదులను మాతృమూర్తిగా పూజిస్తారు. నదీమతల్లి అనే పదం ఆ భావంలో నుంచి పుట్టిందే.కానీ మన దేశంలోని అనేక నదుల తాజా పరిస్థితి అందరికీ తెలిసిందే. ఇళ్ల నుంచి వచ్చే వ్యర్థాలు, చెత్తా చెదారం, పరిశ్రమల నుంచి వచ్చే విషతుల్య రసాయనాలు నదులలో కలుస్తున్నాయి. ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరి కారణంగా నదులు కాలుష్యానికి గురవుతు న్నాయి. అంతిమంగా దేశంలోని మెజారిటీ నదులు ఇవాళ పెద్ద మురికి కాలువలుగా మారిపోయాయి. ప్రజలకు సురక్షిత నీరు అందించాలంటే ముందుగా నదులను కాపాడుకోవాలి, కాలుష్యం నుంచి నదులను రక్షించు కోవాలి. ప్రభుత్వాలు ఈ మహత్యార్యంపై దృష్టి పెట్టాలి.
1972లో మరఠ్వాడాలో తీవ్ర నీటిఎద్దడి
1972-73 ప్రాంతంలో మహారాష్ట్రలోని మరఠ్వాడా ప్రాంతంలో తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడింది. దీంతో నీటి ఎద్దడిని నివారించడానికి దుష్కాల్‌ నివారణ్‌ పేరుతో ఓ ప్రజా ఉద్యమం నడిచింది. ఈ ఉద్యమానికి మేధావులు, విద్యావేత్తలు, ప్రజా సమస్యలపై అవగాహన ఉన్న కొంతమంది నేతలు మద్దతు ప్రకటించారు. మరఠ్వాడా నీటి సంక్షోభం మనిషి సృష్టించిన అనావృష్టి అని ఈ ఉద్యమం తేల్చి చెప్పింది. దీనికి విరుగుడు పరీవాహక ప్రాంతాల మధ్య ఉండే ప్రదేశాలను అభివృద్ధి చేయడమే నని ప్రతిపాదించింది.అయితే ఈ ప్రతిపాదలను ప్రభు త్వాలు సీరియస్‌గా తీసుకోవడం లేదు. దీనివల్లనే మరఠ్వాడా ప్రాంతం ఇప్పటికీ నీటి ఎద్దడితో నానా ఇబ్బందులు పడుతోందంటున్నారు నిపుణులు.
ప్రపంచవ్యాప్తంగా నీటి ఎద్దడి ఇంత తీవ్రంగా ఉన్నా, ఐక్యరాజ్య సమితి దీనిని ఒక తీవ్రమైన అంశంగా పరి గణించలేదు. నీటి సంక్షోభంపై ఎప్పుడో 1977లో అర్జెం టైనాలో ఐక్యరాజ్యసమితి ఒక సమావేశాన్ని నిర్వహిం చింది. అప్పట్లో 118 దేశాల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఆ తరువాత నీటి ఎద్దడిలాంటి కీలక అంశాన్ని ఐక్యరాజ్యసమితి మరచిపోయింది. తాజాగా 46 ఏళ్ల తరువాత మరోసారి ఐక్యరాజ్యసమితి మూడు రోజుల పాటు నీటి సంక్షోభంపై ఓ సమావేశాన్ని నిర్వహించింది.
నీటి సంక్షోభాన్ని పరిష్కరించడానికి ఐక్యరాజ్యసమితి పకడ్బందీ చర్యలు తీసుకోవాలని అనేక దేశాలు కోరుతు న్నాయి. గొంతు తడుపుకోవడానికి సురక్షిత నీరు అందే లా ఐక్యరాజ్యసమితి కీలక నిర్ణయాలు తీసుకోవాలని ప్రపంచదేశాలు కోరుతున్నాయి.
ఎస్‌, అబ్దుల్‌ ఖాలిక్‌
సీనియర్‌ జర్నలిస్ట్‌
63001 74320

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News