Sunday, October 6, 2024
Homeనేషనల్Gujarat Polls: గుజరాత్ అసెంబ్లీ సమరం.. నేడు తొలి విడత పోలింగ్!

Gujarat Polls: గుజరాత్ అసెంబ్లీ సమరం.. నేడు తొలి విడత పోలింగ్!

- Advertisement -

Gujarat Polls: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సమరం మొదలైంది. ఈ ఎన్నికలలో భాగంగా ఈరోజు తొలి విడత పోలింగ్ ప్రారంభం అవుతుంది. మంగళవారం సాయంత్రం ప్రచారానికి తెరపడగా.. డిసెంబర్ 1న నేడు తొలి విడత పోలింగ్ జరుగనుంది. మరో ఇక్కడ విజయం ఎవరిది.. ప్రధాని సొంత రాష్ట్రమైన గుజరాత్ లో మళ్ళీ బీజేపీ జెండా ఎగరనుందా? లేక ఈసారి అనూహ్యంగా కాంగ్రెస్ పుంజుకుంటుందా?.. లేక ప్రజలు ప్రత్యామ్నాయంగా ఆమ్ ఆద్మీకి జై కొడతారా? ఇదే ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతుంది.

ఈ సమరంలో గెలుపే లక్ష్యంగా బీజేపీ, కాంగ్రెస్‌ ప్రచారం సాగించగా, ఆమ్ ఆద్మీ పార్టీ సైతం పక్కా వ్యూహరచనతో ప్రచారం సాగించింది. ఈ మూడు ప్రధాన పార్టీలతో పాటు ఇతర పార్టీలు కూడా ఈసారి గతంలో కంటే ఎక్కువ మంది అభ్యర్థులను బరిలో దింపి తమ ఉనికిని చాటుకోవాలని చూస్తున్నాయి. అయితే.. ప్రధాని సొంత రాష్ట్రం కనుక దాదాపుగా ఇక్కడ బీజేపీ తిరిగి అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉందంటున్నాయి సర్వేలు.

గుజరాత్‌ లో 27 ఏళ్లుగా బీజేపీ తిరుగులేని విజయాలను చూస్తుంది. దీంతో బీజేపీ ఇక్కడ తిరిగి అధికారం దక్కించుకోవాలని విస్తృత ప్రచారం సాగించింది. బీజేపీ సుదీర్ఘ పాలనతో జనం విసిగిపోయారని.. అదే తమకి కలిసి వచ్చే అవకాశం ఉందని కాంగ్రెస్ కూడా హోరాహోరీ ప్రచారం నిర్వహించారు. ఇక 2017 ఎన్నికల్లో ఖాతా కూడా తెరవని ఆమ్ ఆద్మీ పార్టీ ఇటీవల పంజాబ్‌లో సాధించిన ఘన విజయంతో గుజరాత్‌పై గట్టి ఆశలే పెట్టుకుని.. మూడవ ప్రత్యామ్నాయం తామే అంటూ తీవ్రంగా ప్రచారానికి తెరతీశారు.

బీజేపీ తరఫున ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా సహా పలువురు కేంద్ర మంత్రులు, సీఎంలు ఎన్నికల ప్రచారం సాగించారు. ఇక, భారత్ జోడో యాత్రలో ఉన్నందున కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కొద్ది సమయం మాత్రమే ప్రచారానికి వెచ్చించారు. అయితే, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అశోక్ గెహ్లాట్ తదితరులు ఎన్నికలు ప్రచారం సాగించారు. ఇక, ఆప్ నుంచి ఆ పార్టీ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా తదితరులు ప్రచారం సాగించగా.. ఏపీలో జగన్ మాదిరి.. అక్కడ ఆప్‌కు ఒక్క అవకాశం ఇవ్వాలని ఓటర్లను కేజ్రీవాల్ కోరారు. మరి ఈ మూడుముక్కలాటలో విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News