కోడుమూరు పంచాయతీలోని దేవతల సహిత శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించారు భారతి సిమెంట్ అధికారులు. స్థానిక కోడుమూరు పట్టణములోని పంచాయతన దేవతల సహిత శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆలయ పునఃనిర్మాణాన్ని భారతి సిమెంట్ వైస్ ప్రెసిడెంట్ ఎం.సి.మల్లా రెడ్డి, భారతి సిమెంట్ టెక్నికల్ హెడ్ ఓబుల్ రెడ్డి భారతి సిమెంట్ కర్నూలు జిల్లా అధికారి ఎస్.ఇక్బాల్ బాషా దేవస్థాన నిర్మాణాన్ని సందర్శించారు.
వైస్ ప్రెసిడెంట్ శ్రీ ఎం.సి.మల్లా రెడ్డి నిర్మాణాన్ని ఉద్దేశించి ప్రస్తుత కాలంలో కోడుమూరు గ్రామస్తులంతా ఏకమై 9 కోట్ల రూపాయల వ్యయంతో అద్భుతమైన రాతి కట్టడముతో కూడిన రాతి శిల్పములు తయారు చేస్తూ దేవస్థానాన్ని పునః నిర్మాణము చేయడము ఇప్పటి కాలంలో చాలా అరుదు అని తెలిపి ఆలయ నిర్మాణాన్ని చేస్తున్నటువంటి ఆలయ చైర్మన్ ఎద్దుల మహేశ్వర రెడ్డి మరియు కమిటీ సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు రాజశేఖర్, వేణు, వెంకటేశ్వర రెడ్డి, గంగాధర్ ఆచారి, కిషోర్, మధు, సందీప్ తదిరదులు పాల్గొన్నారు.
Kodumuru: కోడుమూరు ఆలయాన్ని సందర్శించిన భారతి సిమెంట్ బృందం
సంబంధిత వార్తలు | RELATED ARTICLES