Friday, September 20, 2024
Homeఆంధ్రప్రదేశ్Katasani: పురాతన బ్రిడ్జి స్థానంలో కొత్త బ్రిడ్జి

Katasani: పురాతన బ్రిడ్జి స్థానంలో కొత్త బ్రిడ్జి

బనగానపల్లె మండలంలో క్రిష్ణగిరి వద్ద పురాతన బ్రిడ్జిని పరిశీలించారు ఆర్ అండ్ బి అధికారులు, కాటసాని తిరుపాల్ రెడ్డి. బనగానపల్లె మండలం క్రిష్ణగిరి గ్రామ సమీపంలో చిన్నరాజుపాలెం వెళ్లే దారిలో గల పురాతన ఆర్ అండ్ బి బ్రిడ్జి స్థానంలో కొత్త బ్రిడ్జి నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి సోదరుడు మండల వైసీపీ కన్వీనర్ కాటసాని తిరుపాల్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆర్ అండ్ బి శాఖ కర్నూలు జిల్లా ఎస్ఈ ఆర్ నాగరాజు, డీఈ సీవీ సునీల్ రెడ్డి, ఏఈ హుస్సేన్ లతో కలిసి శిధిలావస్థకు చేరుకున్న పురాతన బ్రిడ్జిని పరిశీలించారు.

- Advertisement -

ఈ సందర్భంగా కాటసాని తిరుపాల్ రెడ్డి మాట్లాడుతూ నవాబుల కాలంలో నిర్మించిన పురాతన బ్రిడ్జి శిథిలావస్థకు చేరుకొని ప్రమాదకరంగా మారిందని అన్నారు. పాత బ్రిడ్జి స్థానంలో కొత్త బ్రిడ్జి నిర్మించే చర్యల్లో భాగంగా ఆర్ అండ్ బి అధికారులతో కలిసి పరిశీలించామన్నారు. బ్రిడ్జి వద్ద మలుపు ఉండడంతో ఈప్రదేశంలోప్రమాదాలుచోటుచేసుకుంటున్నాయని, మలుపు లేకుండా వీలైనంత పొడవుగా బ్రిడ్జి నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ఆయన తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News