Friday, September 20, 2024
Homeఆంధ్రప్రదేశ్AndhraPradesh: ప్రాంతీయమా.. సంక్షేమమా.. ఏపీలో ఈసారి పరిస్థితేంటి?

AndhraPradesh: ప్రాంతీయమా.. సంక్షేమమా.. ఏపీలో ఈసారి పరిస్థితేంటి?

- Advertisement -

AndhraPradesh: ఏపీలో ఈసారి విజయం ఎవరిది? జగన్మోహన్ రెడ్డికి ఏపీ ప్రజలు మరో అవకాశం ఇస్తారా? లేక టీడీపీ అధినేత చంద్రబాబుకి చివరి అవకాశం ఇస్తారా? ఈ ఇద్దరిలో ఎవరు గెలిచినా అసలు ఈసారి ప్రజల మూడ్ ఎలా ఉండబోతుంది? ఈసారి ఎన్నికలకు కీలకంగా మారే అంశం ఏంటి? ప్రజలు ఏ లెక్కన అధికారం కట్టబెట్టపోతున్నారు? ఇదే ఇప్పుడు విశ్లేషకులకు సైతం చర్చనీయాంశంగా కనిపిస్తుంది.

రాష్ట్ర విభజన అనంతరం అనుభవమున్న ముఖ్యమంత్రి కావాలని.. రాష్ట్ర అభివృద్ధి కావాలంటే చంద్రబాబు సీఎం కావాలని 2014 ఎన్నికలలో టీడీపీకి అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అడిగిన ఒక్క ఛాన్స్ 2019 ఎన్నికలలో ప్రభావం చూపించి వైసీపీకి అధికారం ఇచ్చారు. మరి ఇప్పుడు రాబోయే ఎన్నికలలో ఇలా ప్రభావం చూపించే అంశం ఏంటన్నదే ఇప్పుడు ఆసక్తికర అంశం.

ఇప్పుడున్న అధికార పార్టీ వైసీపీని చూస్తే ఈసారి జగన్ మూడు రాజధానుల అంశం మీదనే ఎన్నికలకు వెళ్లే ఛాన్స్ కనిపిస్తుంది. ప్రస్తుతానికి ఈ రాజధానుల అంశంపై ఎలాంటి బిల్లులు పెండింగ్ లో లేవు. కానీ.. సరైన సమయం చూసి బిల్స్ తీసుకొచ్చేందుకు వైసీపీ సిద్ధంగా ఉంది. ఎలాగూ ఆశించిన స్థాయిలో రాష్ట్రంలో అభివృద్ధి కనిపించలేదు. సంక్షేమం అమలుకు వైసీపీ ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చినా గ్రౌండ్ లెవెల్ లో చూస్తే అసంతృప్తి క్లియర్ గా కనిపిస్తుంది. దీంతో జగన్ ఈసారి మూడు రాజధానులనే నమ్ముకొనే ఛాన్స్ కనిపిస్తుంది.

ఇక టీడీపీ విషయానికి వస్తే చంద్రబాబు ఇప్పటికే ఇదే నాకు చివరి ఛాన్స్ అని చెప్పేశారు. సహజంగా ప్రతిపక్షానికి ప్రజల వద్దకు వెళ్లేందుకు అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇక, ఏపీలో కుంటుపడిన అభివృద్ధిపై ప్రజల వద్దకు వెళ్తున్న చంద్రబాబు.. రాష్ట్ర అప్పులను, అవినీతిని, కక్షసాధింపుని హైలెట్ చేయనున్నారు. అయితే.. తాము మూడు రాజధానులు కట్టి, మూడు ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని చెప్తుంటే.. చంద్రబాబే అడ్డుపడుతున్నాడని వైసీపీ ప్రచారాన్ని ఉత్తరాంధ్ర, రాయలసీమలో టీడీపీ ఎలా ఎదుర్కుంటుందన్నదే ఇక్కడ సవాల్. మరి దీన్ని బట్టి చూస్తే ఈ సారి ఎన్నికలలో ఏపీలో ప్రాంతీయ రాజకీయం ప్రధాన భూమిక అయ్యే ఛాన్స్ కనిపిస్తుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News