Thursday, September 19, 2024
HomeతెలంగాణChoppadandi: రజకుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి

Choppadandi: రజకుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి

రాష్ట్ర ప్రభుత్వం రజకుల అభ్యున్నతికి కృషి చేస్తుందని చొప్పదండి శాసనసభ్యులు సుంకే రవిశంకర్ అన్నారు. ఈ మేరకు చొప్పదండి పట్టణంలోని మడేల్ అయ్యా గుడిలో పూజా కార్యక్రమాలను నిర్వహించి అనంతరం రజకుల సంఘం నాయకులు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రజకులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తానని అన్నారు. భవన నిర్మాణానికి 10 లక్షల నిధులను కేటాయిస్తానని వారికి హామీ ఇచ్చారు. చేనేత కార్మికులకు ప్రభుత్వ నుండి వర్తించే సంక్షేమ పథకాలను రజకులకు కూడా వర్తించేలా శాసనసభలో మాట్లాడుతానని అన్నారు. కుడి చెరువు లోనికి డి 87 ప్రధాన కాలువ ద్వారా నీటిని విడుదల చేస్తానని తెలిపి అప్పటికప్పుడే ఎస్సారెస్పీ అధికారులతో మాట్లాడారు.

- Advertisement -

బీసీ కార్పొరేషన్ ద్వారా అందించేటువంటి సంక్షేమ పథకాలు రజకులు కూడా వినియోగించుకోవాలని సూచించారు. 55 సంవత్సరాలు నిండిన వారికి పెన్షన్ మంజూరు చేయాలని, పలువురు రజకులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం దిశగా కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ గుర్రం నీరజ భూమిరెడ్డి కౌన్సిలర్లు మాధురి శ్రీనివాస్ టిఆర్ఎస్ పట్టణ శాఖ అధ్యక్షులు ఒక రాజేశ్వర్ రెడ్డి పట్టణ కోఆప్షన్ సభ్యులు ఎండి అజ్జు రజక సంఘం నాయకులు చీకటి కుమారస్వామి మావురం రాములు నిజామాపురం చందు పొన్నాల రాజు కుల పెద్దలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News