Monday, November 25, 2024
Homeచిత్ర ప్రభRam Charan: పెటర్నిటీ లీవ్ లో రాం చరణ్, 3 నెలల లీవ్

Ram Charan: పెటర్నిటీ లీవ్ లో రాం చరణ్, 3 నెలల లీవ్

రాం చరణ్, ఉపాసన దంపతులు త్వరలో తల్లిదండ్రులు కాబోతున్న నేపథ్యంలో తన ప్రొఫెషనల్ లైఫ్ లో రాం చరణ్ బ్రేక్ తీసుకుంటున్నారు.  3 నెలలపాటు పెటర్నిటీ లీవ్ తీసుకుని ఫాదర్ లైఫ్ ను ఎంజాయ్ చేయనున్నారు.  మే నెలాఖరులో ఉపాసన డెలివరీ డేట్ ఉండటంతో ఇక అప్పటినుంచీ తల్లి, బిడ్డతోనే ఎక్కువ సమయం గడిపేలా రాం చరణ్ లీవ్ తీసుకుంటుండటం విశేషం.  కడుపుతో ఉన్న ఉపాసన వెరైటీగా చాలామందికి ఇన్స్పిరేషన్ గా పలు విషయాల్లో చాలా నార్మల్ గా బిహేవ్ చేస్తున్నారు.  అతిగా బరువు పెరక్కుండా, ప్రెగ్నెన్సీ వేర్ కాకుండా రెగ్యులర్ వేర్ ధరించటం, ప్రపంచమంతా తిరగటం, తన ఆఫీస్ వర్క్స్ యథావిధిగా చూసుకుంటూ అత్యంత సాధారణమైన లైఫ్ ను లీడ్ చేసి, ప్రెగ్నెన్సీ మిత్స్ ను పోగొడుతుండటం విశేషం.  మిగతా సెలబ్రిటీలంతా డెలివరీ వరకు పెద్దగా పబ్లిక్ అప్పియరెన్స్ ఇవ్వకుండా ఉండటం వంటివాటికి దూరంగా ఉపాసన ఉంటూ తన సోషల్ మీడియాలో, ఫంక్షన్స్ లో చాలా జనరల్ గా కనిపిస్తున్నారు.

    సంబంధిత వార్తలు | RELATED ARTICLES
    spot_img

    Latest News