Sunday, October 6, 2024
HomeతెలంగాణTeluguprabha Effect: తెలుగుప్రభ ఎఫెక్ట్, తాండూరు మున్సిపల్ ఆఫీసుకు బోర్డు

Teluguprabha Effect: తెలుగుప్రభ ఎఫెక్ట్, తాండూరు మున్సిపల్ ఆఫీసుకు బోర్డు

తాండూరు మున్సిపాలిటీ భవనం ఇప్పుడు చూడముచ్చటగా తయారైంది. ఏదో ఒక పనిపై తాండూరు మున్సిపాలిటీ ఆఫీస్ కు వచ్చినవారంతా మున్సిపల్ ఆఫీస్ ఎక్కడుందని అడిగేవారు. కానీ ఎప్పుడైతే తెలుగుప్రభ దినపత్రికలో ఈ భవనం పేరేమిటి అంటూ ప్రత్యేక కథనం ప్రచురితం అయిందో అప్పుడు అధికారుల్లో కదలిక మొదలైంది. ఎట్టకేలకు తాండూరు మున్సిపల్ ఆఫీసుకు బోర్డు పెట్టారు. దీంతో స్థానికులంతా ఈ క్రెడిట్ తెలుగుప్రభ దినపత్రికదే అంటూ ప్రశంసిస్తున్నారు. కార్యాలయానికి బోర్డు పెట్టడంతో ఆఫీసుకే కొత్తకళ వచ్చినట్టైందని మున్సిపల్ ఆఫీస్ సిబ్బంది కూడా చర్చిస్తుండటం విశేషం.

- Advertisement -

మార్చ్ 29న తెలుగు ప్రభ దినపత్రికలో ఈ భవనం పేరిమిటి? తాండూర్ మున్సిపల్ కార్యాలయం అని పేరు రాయడానికి మరిచిపోయారా…? అని కథనం పత్రికలో ప్రచురించాము. అధికారులు స్పందించి మున్సిపల్ కార్యాలయానికి బోర్డు ఏర్పాటు చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News