Sunday, November 24, 2024
Homeఆంధ్రప్రదేశ్Cannabis : ‘ఆపరేషన్ పరివర్తన్’.. నగరం నడిబొడ్డున గంజాయి సాగు

Cannabis : ‘ఆపరేషన్ పరివర్తన్’.. నగరం నడిబొడ్డున గంజాయి సాగు

ఏజెన్సీ గ్రామాలు, కొండల గుట్టల మధ్య గుట్టుగా జరిగే గంజాయి సాగు బరితెగించింది. ఏకంగా నగరంలోకి వచ్చి చేరుతోంది. ఇంటి పెరట్లోనే ఎంచక్కా గంజాయిని కూడా సాగు చేస్తున్న ఓ కుటుంబాన్ని అదుపులోకి తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో గంజాయి సాగు ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని బాపూజీ కాలనీలో గంజాయి మొక్కలు సాగు చేస్తున్నట్లు గుర్తుతెలియని వ్యక్తుల నుంచి సమాచారం వచ్చింది.

- Advertisement -

సిబ్బందితో కలిసి ఆ ప్రాంతానికి వెళ్లిన పోలీసులు ఓ ఇంటిని తనిఖీ చేయగా.. ఇంటివెనకున్న పెరట్లో మూడు గంజాయి మొక్కలు కనిపించాయని వెల్లడించారు.స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో పోలీసులు కూడా అక్కడికి చేరుకుని ఆ మొక్కలను పరిశీలించి అవి గంజాయి మొక్కలేనని నిర్థారించారు. దాంతో ఆ ఇంటి యజమానులైన దాసరి దానమ్మ, దాసరి పేరయ్యలను అదుపులోకి తీసుకున్నారు. ఈ మొక్కల సాగుకు సంబంధించి ప్రధాన నిందితుడిగా అనుమానిస్తున్న కనిగిరి శివ అనే యువకుడు పరారీలో ఉన్నట్లు తెలిపారు. ఈ మొక్కల నుండి తీసిన గంజాయిని కాలేజీ విద్యార్థులు, యువతకు అమ్ముతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

ఏజెన్సీ లో ఉండే ప్రజలను గంజాయి సాగు నుంచి తప్పించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘ఆపరేషన్ పరివర్తన్’ కార్యక్రమం ప్రారంభించింది. పోలీసులు, ఇతర అధికారులు ఏజెన్సీ గ్రామాల్లో పర్యటించి, చట్టవ్యతిరేకమైన గంజాయి సాగు నుంచి వారిని దూరం చేసి, ప్రభుత్వం ద్వారా సబ్సిడీ కింద విత్తనాలను అందజేసి ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు ప్రోత్సహించారు. కానీ.. ఇప్పుడు ఏకంగా నరాల్లోని ఇళ్ల పెరట్లలో గంజాయిని సాగు చేస్తుండటం ఆందోళన కలిగిస్తోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News