ఎండలను లెక్కచేయకుండా స్వాగతం పలికిన కాల్వ శ్రీరాంపూర్ ఆడబిడ్డలకు, గ్రామప్రజలకు పేరుపేరునా ప్రత్యేక నమస్కారాలు తెలిపారు కాంగ్రెస్ నేత భట్టీ విక్రమార్క. ఈఎండల్లో వందల కిలోమీటర్లు పాదయాత్ర చేస్తూ మీ అందరితో మాట్లాడుతూ ఇబ్బందులు, సమస్యలు తెలుకుని వాటి పరిష్కారం కోసం పోరాటం చేసేందుకే మా ప్రయత్నం అంటూ భట్టీ వివరించారు. ఎన్నికలు ఉన్నాయనో, లేక కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయమని అడిగేందుకు మేయు రావడం లేదని, మేము వచ్చింది.. తెలంగాణ ప్రజల సుభిక్షం కోసం, ఇందిరమ్మ రాజ్యం తెచ్చేందుకు.. సమస్యలు దూరం చేసి ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు అందించేందుకు పాదయాత్ర చేస్తున్నామన్నారు.
పీపుల్స్ మార్చ్ పాదయాత్ర.. అనేది అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అగ్రనాయత్వం ఆలోచన అన్న ఆయన పాదయాత్ర సాగుతున్న ప్రతి చోటా ప్రజలు తమ ఇబ్బందులు చెప్పుకునేందుకు వస్తున్నారన్నారు. ఆదిలాబాద్ బోథ్ నియోజకవర్గం నుంచి మొదలైన పాదయాత్రలో ప్రతి చోటా అనేమ సమస్యలు, ఇబ్బందులు మా ద్రుష్టికి వచ్చాయని, పెద్దపల్లి నియోజకవర్గంలోనూ.. ప్రజలు పడుతున్న కష్టాలు, సమస్యలు మా ద్రుష్టికి వచ్చాయన్నారు.
ఈ కార్నర్ మీటింగ్ లో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు రాజ్ ఠాకూర్, మాజీ ఎమ్మెల్యే విజయ రమణారావు, కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ఛైర్మన్ అన్వేష్ రెడ్డి, గంటా రాములు యాదవ్, ప్రకాస్ రావు, లంకా సైదయ్య, అక్బర్ అలీ, సతీష్, ఎండీ మునీద్, అన్నయ్య గౌడ్, రమేష్, మహేష్ , శ్రీనివాస్, భూపాల్లి డీసీసీ అధ్యక్షుడు ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.