Sunday, November 10, 2024
Homeఆంధ్రప్రదేశ్AP: వైయస్సార్‌ ఉచిత పంటల బీమా పథకానికి జాతీయ స్ధాయిలో గుర్తింపు

AP: వైయస్సార్‌ ఉచిత పంటల బీమా పథకానికి జాతీయ స్ధాయిలో గుర్తింపు

డాక్టర్‌ వైయస్సార్‌ ఉచిత పంటల బీమా పథకానికి జాతీయ స్ధాయిలో గుర్తింపు దక్కింది. అవార్డు గెలుచుకోవడంపై వ్యవసాయ శాఖ అధికారులను అభినందించారు సీఎం వైఎస్‌ జగన్‌. ఇటీవల రాయ్‌పూర్‌లో జరిగిన పీఎంఎఫ్‌బీవై జాతీయ సదస్సులో ఇన్నోవేషన్‌ కేటగిరీలో ప్రత్యేక ప్రశంసా పత్రాన్ని వ్యవసాయ శాఖ స్పెషల్‌ కమిషనర్‌ హరికిరణ్‌కు అందజేశారు కేంద్ర వ్యవసాయ కార్యదర్శి మనోజ్‌ అహుజా. సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను కలిసి, భారత ప్రభుత్వం అందజేసిన జ్ఞాపికను చూపించారు వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ఆ శాఖ స్పెషల్‌ కమిషనర్‌ సి.హరికిరణ్‌.

- Advertisement -

అధికారులను అభినందిస్తూ, భవిష్యత్తులో మరింత సమర్ధవంతంగా పనిచేయాలని, దిగుబడుల అంచనాలలో టెక్నాలజీ వినియోగం పెంచాలని దిశానిర్ధేశం చేశారు సీఎం వైఎస్‌ జగన్‌. సాగుచేసిన ప్రతి ఎకరా పంట వివరాలను అత్యంత పారదర్శకంగా ఈ–క్రాప్‌ ద్వారా నమోదు చేయడం, తద్వారా ఉచిత పంటల బీమా పథకాన్ని కేవలం ఈ–క్రాప్‌ నమోదు ఆధారంగా అమలుచేయడం ద్వారా యూనివర్శల్‌ కవరేజిని సాధించిన ఏకైక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ రికార్డులకెక్కింది .

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News