Thursday, September 19, 2024
Homeచిత్ర ప్రభChiru-Balayya : చిరు, బాలయ్య మల్టీస్టారర్.. స్టార్ ప్రొడ్యూసర్ వ్యాఖ్యలు..

Chiru-Balayya : చిరు, బాలయ్య మల్టీస్టారర్.. స్టార్ ప్రొడ్యూసర్ వ్యాఖ్యలు..

- Advertisement -

Chiru-Balayya : ఇటీవల మల్టీస్టారర్ మూవీస్ పెరిగిన సంగతి తెలిసిందే. స్టార్లు సైతం మల్టీస్టారర్ సినిమాలకి ఓకే చెప్తున్నారు. ఒకప్పుడు కూడా స్టార్ హీరోలు సైతం కలిసి నటించారు. తాజాగా ఓ క్రేజీ కాంబినేషన్ గురించి మాట్లాడారు. బాలకృష్ణ హోస్ట్ గా ఆహా ఓటీటీలో అన్‌స్టాపబుల్ షో వస్తున్న సంగతి తెలిసిందే. సీజన్ 2లో తాజాగా ఐదో ఎపిసోడ్ ప్రోమోని రిలీజ్ చేశారు.

ఈ ఎపిసోడ్ కి అల్లు అరవింద్, సురేష్ బాబు, రాఘవేంద్ర రావు, కోదండరామిరెడ్డి విచ్చేశారు. దీంతో షో చాలా సందడిగా సాగింది. అప్పటి సినిమాల గురించి, సినీ పరిశ్రమ గురించి చాలా మాట్లాడారు. ప్రోమోలో కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలని చూపించారు. ఇందులో అల్లు అరవింద్.. చిరంజీవి, బాలకృష్ణ హీరోలుగా తాను నిర్మాతగా సినిమా తీస్తాను ఒప్పుకుంటే అన్నాడు. అప్పుడు బాలయ్య అది పాన్ వరల్డ్ సినిమా అవుతుందని అన్నారు.

దీంతో ఈ వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి. ఇండస్ట్రీ సీనియర్ స్టార్ హీరోలు ఇద్దరూ బాలయ్య, చిరు. వాళ్లిద్దరూ బయట ఎలా ఉన్నా సినిమాలు మాత్రం పోటీ పడతాయి. ఇక వారి అభిమానులు సినిమా హాళ్ల దగ్గర మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అని కొట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. మరి అలాంటిది ఈ స్టార్ హీరోలతో మల్టీస్టారర్ అంటే సాధ్యమేనా చూడాలి. అయితే గతంలో ఎన్టీఆర్, ఏఎన్నార్.. ఇటీవల చరణ్, ఎన్టీఆర్ కూడా కలిసి చేశారు. అల్లు అరవింద్ అన్నట్టు బాలయ్య-చిరు కాంబోలో సినిమా వస్తే థియేటర్స్ దద్దరిల్లడం ఖాయం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News