Thursday, September 19, 2024
HomeతెలంగాణManchiryala: అకాల వర్షాలకు రైతులకు తీరని నష్టం

Manchiryala: అకాల వర్షాలకు రైతులకు తీరని నష్టం

మంచిర్యాల జిల్లా జన్నారం మండలం గత అర్ధరాత్రి అకాల వర్షాలకు, పిడుగులతో గాలివనతో అనేక గ్రామాలలో మామిడి తోటలు పట్టున్నకున్న రైతులకు గాలికి కిందపడి పగిలిపోయిన మామిడికాయలు మిగిలినాయి 80% మామిడి పండ్లు నేలరాలినాయి. రైతులు లబొదిబో అంటు గుత్తకు పట్టుకున్న వ్యాపారులకు లక్షల రూపాయల నష్టం జరిగిందని తలలు పట్టుకుంటున్నారు. పొలాలు కోసిన రైతులు కల్లంలో నీళ్లలో మునిగిపోయిన వరి దాన్యం, ఏమిచేయలేక రైతు వడ్లలలో నిలిచిన నీటిని ఎత్తిపొసుకున్నారు పొలాలు కోయని పొలాల్లోనే వడ్లు 90% నుంచి 99% వడ్లు రాలినాయి కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ మంచి మనుసుతో మానవత దృక్పధంతో ఆలోచించి ఎంత నష్టం జరిగిందో అంత నష్టపరిహారం చెల్లించాలని వంచిత్ బహుజన్ ఆఘాడి (విభిఏ) పార్టీ జిల్లా అధ్యక్షులు గవ్వల శ్రీకాంత్ విజ్ఞప్తి చేస్తూ డిమాండ్ చేశారు. అదేవిధంగా మండల జిల్లా అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు రైతులకు వ్యాపారస్తులకు నష్టపరిహారం తొందరగా అందేవిదంగా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. అనేక ప్రాంతాలలో త్వరగా సెంటర్ ప్రారంభించాలని, కొన్ని ప్రాంతంలో ఉన్న ఎందుకు పనిచేయడం చేయలేదని ప్రశ్నించారు. సెంటర్ లు ఓపెన్ చేయడానికి ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యమా, అధికారుల నిర్లక్ష్యమా కేసీఆర్ దీనిపై పూర్తి విచారణ జరిపించాలని గవ్వల శ్రీకాంత్ డిమాండ్ చేశారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో వంచిత్ బహుజన్ విద్యార్థి యువ నాయకులు, మండల అధ్యక్షులు కండ్లే అరుణ్, కండ్లే సాయి కండ్లే, వంశీ కాలువ, ప్రశాంత్ పార్టీ నాయకులు దుబ్బయ్య, నర్సయ్య, రాములు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News