Friday, September 20, 2024
Homeనేషనల్Aurangabad: బీఆర్ఎస్ లో భారీగా చేరికలు

Aurangabad: బీఆర్ఎస్ లో భారీగా చేరికలు

ఔరంగబాద్ జిల్లాలో “గులాబీ”ప్రభంజనం కొనసాగుతోంది. ఈ నెల 24వ తేదీన ఛత్రపతి శంబాజీనగర్ (ఔరంగబాద్) జబిందా మైదానంలో బీఆర్ఎస్ సభను పెద్ద ఎత్తున నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్న నేపధ్యంలో బీఆర్ఎస్ లో చేరేందుకు వివిధ పార్టీల నేతలు క్యూ కడుతున్నారు. ఔరంగబాద్ జిల్లాలోని అన్ని గ్రామాల్లో ప్రచారరధాల ద్వారా తెలంగాణ రాష్ట్రంలో అమలు జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఈ పథకాల పట్ల అమితంగా ఆకర్షితులవుతున్న మహిళలు, యువత కేసీఆర్ నాయకత్వం వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో వారంతా ముందుకు వచ్చి
పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి సమక్షంలో నిత్యం భారీ చేరికల పరంపర జోరుగా సాగుతోంది.
తాజాగా మహారాష్ట్రలోని ఛత్రపతి శంబాజీనగర్ (ఔరంగబాద్) లో జరిగిన కార్యక్రమంలో జిల్లా పరిధిలోని వివిధ పార్టీలకు చెందిన నాయకులు జీవన్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. చేరిన వారిలో రాష్ట్రవాది పశ్చిమ షెహర్ ఉపాధ్యక్షుడు షేక్ అబ్రార్, షేక్ ఫైజాన్, షేక్ ఇమ్రాన్,షేక్ అద్నాన్, రమేష్ పాటిల్, రాజ్ గైక్వాడ్, ఆకాష్ గైక్వాడ్ తదితరులు ఉన్నారు.
వీరందరికి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ కండువా వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అలాగే మరో కార్యక్రమంలో ఛత్రపతి శంబాజీనగర్ (ఔరంగబాద్) జిల్లా కు చెందిన వివిధ పార్టీల నాయకులు బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. గులాబీ గూటికి చేరిన వారిలో మాలుంజా గ్రామ సర్పంచు జగదీశ్ సోలంకె , అబేద్ పటేల్, మన్సూర్ పటేల్, అనీఫ్, రాజారాం మాండే, అన్సారీలతో పాటు పలువురు ఆటో యూనియన్ సభ్యులు ఉన్నారు.
వీరందరికీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ కండువా వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఇదిలావుండగా రిపబ్లిక్ అండ్ పార్టీ ఆఫ్ ఇండియా పట్టణ అధ్యక్షుడు వీర్ దేవరాజ్, వంచిత్ బహుజన్ అగాడి జిల్లా అధ్యక్షుడు అజయ్ మస్కి, ఔరంగాబాద్ పట్టణ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు బన్సీలాల్ కుచే, పర్బని గ్రామ పంచాయతీ సర్పంచ్ గజానంద్, స్థానిక నాయకుడు సచిన్ సాత్ దివే, స్థానిక ఆటో యూనియన్ నాయకుడు యువరాజ్ తదితరులను జీవన్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిసి 24వ తేదీన జరిగే బీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు. కాగా ఈ నెల 24వ తేదీన జబిందా మైదానంలో జరిగే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి భారీ బహిరంగ సభ ఏర్పాట్లను జీవన్ రెడ్డి పరిశీలించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News