Friday, September 20, 2024
Homeఆంధ్రప్రదేశ్Nandyala: జాతీయ రహదారి కోసం భూసేకరణ సర్వే ఆపాలని రాస్తారోకో

Nandyala: జాతీయ రహదారి కోసం భూసేకరణ సర్వే ఆపాలని రాస్తారోకో

నంద్యాల నుండి జమ్ములవడుగు వరకు జాతీయ రహదారి 167 కె నిర్మాణం కోసం భూసేకరణ జరుగుతున్న అధికారులు, కానాల, రైతు నగరం గ్రామాల్లోని పేద రైతుల కడుపులు కోట్టే విధంగా ప్లాన్ రూపొందించారని, కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆ గెజిట్ ను మార్చాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రెండు గ్రామాల రైతులు గత నాలుగు రోజుల క్రితం నుండి సర్వే జరుగుతున్న భూముల్లో ఆందోళన నిర్వహించి, నేడు కెనాల సెంటర్ లో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా నంద్యాల పార్లమెంటు సభ్యుడు పోచా బ్రహ్మానంద రెడ్డి కాన్వాయ్ కి అడ్డుగా కూర్చుని, పోలీసులు ఎంత బలవంతం చేసిన ఆక్కడినుండి లేసేది లేదని, ఎంపీ మా సమస్యను విని పరిష్కరిస్తానని హామీ ఇచ్చేవరకు ఇక్కడ నుండి కథలమని రోడ్డుకు అడ్డంగా పండుకొని నిరసన తెలిపారు. ఎంపీ వాహనం నుండి దిగివచ్చి ఆందోళనకారులతో చర్చించి తమ సమస్యలను తెలుసుకొని వెంటనే జిల్లా ఉన్నత అధికారులతో ఫోన్లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి రాజశేఖర్ ,సహాయ కార్యదర్శి టి రామచంద్రుడు, సిపిఎం నాయకులు నరసింహ, బాల వెంకట్, నిరంజన్, గ్రామ రైతులు ఎంపీతో మాట్లాడుతూ ప్రభుత్వం వేస్తున్న రహదారికి మేము వ్యతిరేకం కాదు. కానీ అధికారులు ముందుగా ప్లాన్ చేసినటువంటి ప్రకారం కాకుండా, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు, భూస్వాములు, అధికార పార్టీ నాయకుల భూములను కాపాడేందుకే ప్లాన్ మార్చి కేవలం ఎకరా, రెండు ఎకరాలలోపు భూములున్న పేద రైతుల భూముల మధ్యలో రహదారి వచ్చే విధంగా సర్వే చేస్తున్నారని, ఈ విధంగా చేయడాన్ని మేము వ్యతిరేకిస్తున్నామని, పేదలకు నష్టం తగ్గే విధంగా, ప్రభుత్వంపై భారం తగ్గే విధంగా ప్రత్యామ్నాయంగా ఉన్న ప్రభుత్వ భూమి లోని రహదారి కిరువైపులా భూసేకరణ చేసి పేద రైతులకు మేలు చేసే విధంగా ప్లాన్ రూపొందించమని అనేకమార్లు సంబంధిత అధికారుల ముందు మొరపెట్టుకున్న తమ సమస్యను పరిష్కారం చేయడం లేదని గత్యంతరం లేకనే రైతు సంఘాల ఆధ్వర్యంలో రోడ్లపై కొచ్చి కూర్చున్నామని, ఎంపీ వెంటనే జోక్యం చేసుకొని తమ సర్వే పనులు వెంటనే ఆపుదల చేయించి గ్రామంలో గ్రామ సభ నిర్వహించి మా అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని రహదారి నిర్మించాలని, 2013 కేంద్ర ప్రభుత్వ భూ సేకరణ చట్టాన్ని అమలు జరిపే విధంగా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. అంతవరకు ఆందోళన విరమించమని రైతులందరూ భీష్మించి కూర్చున్నారు. వెంటనే ఎంపీ ఫోన్లో స్థానిక జాయింట్ కలెక్టర్ తో మాట్లాడి సర్వే పనులను వెంటనే ఆపివేస్తామని, త్వరలోనే గ్రామంలో గ్రామ సభ ఏర్పాటు చేసి రైతుల అభిప్రాయం మేరకు నిర్ణయం తీసుకుంటా మని హామీఇచ్చాడు. ఎంపీ హామీతో తాత్కాలికంగా ఆందోళన నిర్మిస్తున్నామని, హామీ అమలు జరిగే వరకు కుల మతాలకతీతంగా, రాజకీయాలకతీతంగా రైతులందరం కలిసి పోరాడుతామని రైతులు ,రైతు నాయకులు అన్నారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో స్థానిక సిపిఎం నాయకులు యూసఫ్, ఖాదర్ వలీ తోపాటు రైతులు చైతన్య, వెంకటేశ్వర్లు, లక్ష్మన్న, రామ చిన్నమ్మ, మోహన్ రావు,సుబ్బారావు, శంకర్రావు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News