Friday, September 20, 2024
HomeతెలంగాణVanaparthi:100% వరి ధాన్యం సేకరిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ

Vanaparthi:100% వరి ధాన్యం సేకరిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ

దేశంలో వంద శాతం వరి ధాన్యం సేకరిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. వనపర్తి మండలం రాజాపేట, పెద్దమందడి మండలం అల్వాల, చిన్నమందడి, పామిరెడ్డిపల్లి, బలిజపల్లి, జంగమాయపల్లి గ్రామాలలో వరి ధాన్యం కొనుగోలుకేంద్రాలను ప్రారంభించిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 7,100 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని అన్నారు.ధాన్యం తరలింపుకు రైతులకు ఇబ్బంది లేకుండా ఉండడానికి దాదాపు రెండు గ్రామాల మధ్యన, పెద్ద గ్రామం అయితే ఒక కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశామన్నారు.సాగునీటి రాకతో గ్రామాల్లో వ్యవసాయరంగ స్వరూపం మారిపోయిందనీ, రైతులు ప్రతి ఎకరాను సాగుకు యోగ్యంగా మలుచుకుని వ్యవసాయం చేస్తున్నారనీ అన్నారు. రైతును రాజుగా చూడాలన్నదే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం అని అన్నారు. యాసంగిలో రాష్ట్రంలో 56.44 లక్షల ఎకరాలలో వరి సాగు,వనపర్తి జిల్లాలో 1.50 లక్షల ఎకరాలలో సాగు, 4.20 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నామన్నారు.దానికి అనుగుణంగా జిల్లాలో 257 ధాన్యం కొనుగోలు కేంద్రాలు,కోతలను బట్టి కొనుగోలు కేంద్రాల ఏర్పాటు .. యాసంగి కాబట్టి తేమ శాతంలో పెద్దగా ఇబ్బందులు ఉండవు అని అన్నారు.

- Advertisement -

కోతలు పూర్తయిన వెంటనే రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలనీ, తరుగు తీయొద్దని అధికారులను ఆదేశించాం .. ఎక్కడయినా మిల్లర్లు తరుగుతీస్తే వారి లైసెన్సులు రద్దు చేయిస్తాం అని హెచ్చరించారు. రైతులకు అసౌకర్యం కలగకుండా ధాన్యం కొనుగోళ్లు జరగాలనీ, ఆరుగాలం కష్టపడ్డ రైతు పంట చేతికి వచ్చాక అమ్ముకునేందుకు ఇబ్బంది పడవద్దన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన అని గుర్తు చేశారు. ఐకేపీ, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల కొనుగోలు కేంద్రాల వారు భాధ్యతగా, శ్రద్ధతో విధులను నిర్వహించాలని సూచించారు. కొనుగోళ్లకు సంబంధించి అవసరమయిన గన్నీ బ్యాగులు అందుబాటులో ఉన్నాయనీ, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను నిర్వహించాలని సూచించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News