వాల్మీకి రాష్ట్ర కార్యదర్శి ఆస్పరి నరేంద్ర అధ్యక్షతనలో చలో ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర జరిగే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వాల్మీకి సోదరులను కోరారు. ఈ సందర్భంగా పత్తికొండ వాల్మీకి రామాలయంలో చలో ఢిల్లీ సంకల్ప దీక్ష కరపత్రాలను విడుదల చేశారు. సోదరులంతా ఏకమై ఒకటే తాటి మీదకు వచ్చి మన సామాన్య హక్కులను మన సమస్యలను అందరూ కలిసికట్టుగా ఉండి మనమే పరిరక్షించుకోవాలని కోరారు. వాల్మీకి హక్కులను మనమే పరిరక్షించుకోవాలని వాల్మీకి నాయకులు అన్నారు. ఎన్ని ప్రభుత్వాలు మారిన మనకు న్యాయం జరగడం లేదని మన సమస్యను మనమే పరీక్షించుకోవాలని ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర మే 31న జరిగే కార్యక్రమంలో వాల్మీకుల గొంతులు కేంద్రంలో అందరికీ వినబడేలా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. ఈ సందర్భంగా మే 31న జరిగే ఈ కార్యక్రమానికి వాల్మీకి సోదరులు అందరూ చలో ఢిల్లీకీ లక్షలాదిగా తరలిరావాలని వీఆర్పీఎస్ కోరింది.
ఈ కార్యక్రమంలో వీఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మద్దూరు సుభాష్ చంద్రబోస్, రాష్ట్ర నాయకులు కప్పట్రాళ్ల మల్లికార్జున, జిల్లా అధ్యక్షుడు మొలగవల్లి రామాంజనేయులు, జిల్లా కార్యదర్శి టైలర్ రంగన్న, తాలుకా నాయకులు పిఎస్ కృష్ణ, ఆలయ కమిటీ చైర్మన్ శివ శంకర్ నాయుడు, ఆస్పరి రామచంద్ర, సుధాకర్ శీను, వెంకటేశ్వర్లు, బాలు, అజయ, ముద్దన్న, జయరాముడు తదితరులు పాల్గొన్నారు.