Thursday, September 19, 2024
Homeఆంధ్రప్రదేశ్AP Politics : మేం కొట్టే బ్యాచే కానీ, కొట్టించుకునే బ్యాచ్ కాదు: నారా లోకేశ్

AP Politics : మేం కొట్టే బ్యాచే కానీ, కొట్టించుకునే బ్యాచ్ కాదు: నారా లోకేశ్

రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి సోదరుడు చంద్రశేఖర్ రెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్ లపై ఇటీవల తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా వాటిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. ఓ ఎమ్మెల్యే తమ్ముడో, అన్నో నన్ను చంపేస్తాడంట..మేం కొట్టే బ్యాచే కానీ కొట్టించుకునే బ్యాచ్ కాదు అని స్పష్టం చేశారు. తాము ప్రజల కోసం పోరాడుతున్నాం కాబట్టే.. తమపై 15 కేసులు ఉన్నాయని లోకేశ్ వెల్లడించారు. వాటిలో హత్యాయత్నం, ఎస్సీఎస్టీ కేసులు కూడా ఉన్నాయని వివరించారు.

- Advertisement -

బెదిరింపులకు, కేసులకు మేం పారిపోయే రకం కాదు జగన్ రెడ్డీ.. నేను నీలాగా కాదు అంటూ లోకేశ్ వ్యాఖ్యానించారు. తామడిగే ప్రశ్నలకు వైసీపీ నేతలు సరిగ్గా సమాధానం కూడా చెప్పుకోలేరన్నారు. మేం అడిగే ప్రశ్నలకు వైసీపీ నేతలు సరిగ్గా సమాధానం కూడా చెప్పుకోలేరు… మేం ఛాలెంజ్ చేశామంటే ఒక్క వైసీపీ నేత కూడా రోడ్డుపైకి రాడు.. అలాంటోళ్లు మమ్మల్ని చంపేస్తామనడం హాస్యాస్పదంగా ఉందని నారా లోకేశ్ పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News