సమానత్వం సోషలిజం కోసం చాటి చెప్పి పోరాటం చేసిన ప్రపంచ మొట్టమొదటి వ్యక్తి మహాత్మ బసవేశ్వరుడు అని తాండూర్ నియోజకవర్గం బిసి సంఘం కన్వీనర్ రాజ్ కుమార్ కందుకూరి అన్నారు. అక్షయ తృతీయ బసవేశ్వరుని జయంతి సందర్భంగా తాండూర్ పట్టణంలో వీరశైవ సమాజం సముదాయం నందు ఏర్పాటు చేసిన మహాత్మ బసవేశ్వరుని విగ్రహానికి పూలమాలలతో నమస్సుమాంజలు తెలియజేశారు. ఈ సందర్భంగా రాజ్ కుమార్ మాట్లాడుతూ లింగాయత్ సమాజ వ్యవస్థాపకుడు కన్నడ భక్తుడు విప్లవకారుడు సమాజంలో కుల వ్యవస్థను వర్ణబేదాలను లింగ వివక్షతను సమూలంగా వ్యతిరేకించిన అభ్యుదయవాది విశ్వగురు బసవేశ్వరుడు అని అన్నారు. 12వ శతాబ్దంలో బసవేశ్వరుడు స్థాపించిన అనుభవ మండపం ఇప్పటి పార్లమెంట్ తరహాలో ఉండేదని అక్కడ అన్ని రకాల కులాలు జాతులు తమ సమస్యలను వినిపించేవారుని దేవుడే దేవాలయం శ్రమను మించిన సౌందర్యం లేదు అని ఆహారం ఇల్లు బట్ట జ్ఞానం వైద్యం ఇవి మానవుని కనీస హక్కులని చాటిన గొప్ప తత్వవేత అని అంతటి మహనీయుని జయంతి ఉత్సవాలు కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా అధికారికంగా నిర్వహించాలని అలాగే బసవేశ్వర సిద్ధాంతాలను ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేసే విధంగా పాలకులు కృషి చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు సయ్యద్ సుకుర్, జిల్లా నాయకులు గడ్డం వెంకటేష్, యలాల్ మండల అధ్యక్షులు లక్ష్మణ చారి, సోషల్ మీడియా ఇంచార్జ్ బసవరాజ్, బీసీ యువ నాయకులు రాము ముదిరాజ్, హరి ప్రసాద్, నర్సింలు, తాండ్ర నరేష్, నరసింహ, వెంకట్, శివ, శ్రీనివాస్, నర్సింలు, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.