Thursday, September 19, 2024
HomeతెలంగాణChevella: కాంగ్రెస్ పార్టీ గ్రామ కార్యవర్గ కమిటి ఎన్నిక

Chevella: కాంగ్రెస్ పార్టీ గ్రామ కార్యవర్గ కమిటి ఎన్నిక

చేవెళ్ల మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నూతన కమిటి కార్యవర్గ సభ్యులు ఎన్నుకున్నారు. ఇదివరకే నూతన కమిటీలను గ్రామాల వారీగా ఎన్నుకోవడం ప్రారంభించారు. ఇందులో భాగంగానే చేవెళ్ళ గ్రామ కమిటీని ఎన్నుకున్నారు. చేవెళ్ల గ్రామంలో మొత్తం ఐదు నూతన కమిటీలను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు బండారి ఆగిరెడ్డి పి ఎస్ సి హెచ్ చైర్మన్ దేవర వెంకట్ రెడ్డి ఎంపీటీసీ సున్నపు వసంతం హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ఈ కమిటీల ఏర్పాటు వల్ల గ్రామాల్లో పార్టీ బలపడుతుందన్నారు. కమిటి సభ్యులందరూ సమిష్టిగా కృషి చేయాలన్నారు. కమిటీ పార్టీ కార్యకర్తలతో మమేకమై వారి కష్ట సుఖాల్లో పాలుపంచుకోవాలన్నారు.

- Advertisement -

ఇదివరకు పార్టీ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రాధాన్యతను సిద్ధాంతాలను ప్రజలకు ఎప్పటి కప్పుడు చేరవేయాలన్నారు. చేవెళ్ళలో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిపై గ్రామంలో ఉన్న 14 వార్డు మెంబర్లకు 14 గెలుచుకున్నామన్నారు. అదేమాదిరిగా సొసైటీ ఎన్నికల్లో కూడా ఏమాత్రం తగ్గకుండా 12 కు 10 డైరెక్టర్లను గెలిచి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటామన్నారు. 2024 ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా కమిటీ సభ్యులు కార్యకర్తలు పని చేయాలని పిలుపునిచ్చారు. ఆర్ఎంబి గెస్ట్ హౌస్ లో ఆదివారం జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామ అధ్యక్షులుగా బండారి వెంకట్ రెడ్డి ఎన్నికయ్యారు. యూత్ కాంగ్రెస్ అధ్యక్షులుగా అల్లాడ హరిశ్వర్ రెడ్డి, బిసి సెల్ అధ్యక్షులుగా జంగమ్మనొళ్ల హరికృష్ణ, ఎస్సి సెల్ అధ్యక్షులుగా గజ్జల యాదగిరి, మైనారిటీ అధ్యక్షునిగా మహమ్మద్ అజిజ్ లను ఎన్నుకునట్లు డిసిసి ఉపాధ్యక్షులు ఆగిరెడ్డి, సీనియర్ నాయకులు సున్నపు వసంతం, పిఏసిఎస్ చైర్మన్ దేవర వెంకట్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో వీరేందర్ రెడ్డి, మధుసూదన్ గుప్తా, ప్రతాప్ రెడ్డి, మద్దెల శ్రీనివాస్, పడ్డాల ప్రభాకర్, గంగి యాదయ్య, శ్రీనివాస్ యాదవ్, రాఘవేందర్ రెడ్డి,రాములు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News