సర్వజనుల ఆరోగ్యమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రెండవ విడత కంటి వెలుగు పథకం విజయవంతంగా కొనసాగుతున్నదని జిల్లా పరిషత్ చైర్పర్సన్ హేమలత శేఖర్ గౌడ్ అన్నారు. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం రంగాయపల్లి గ్రామంలో స్థానిక సర్పంచ్ నాగభూషణం ముదిరాజ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని జడ్పీ చైర్ పర్సన్ ప్రారంభించారు.ఈ దర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రజల సంక్షేమ ప్రభుత్వమనీ,ఎన్నో పథకాల ద్వారా దేశంలో అగ్రగామిగా దూసుకెళ్తుందనడానికి,తెలంగాణ పంచాయతీలకు వచ్చిన అవార్డులే దర్శనమన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా ముందస్తు ప్రణాళికలతో, నిరంతర పర్యవేక్షణ, రోజువారి సమీక్షలు, విశ్లేషణ, వీడియో కాన్ఫరెన్స్, సమావేశాలతో ఎప్పటికప్పుడు లోటుపాట్లు సవరించుకుంటూ కంటి వెలుగు కార్యక్రమం పకడ్బందీగా అమలు జరుగుతుందన్నారు.
స్థానిక సర్పంచ్ మాట్లాడుతూ ప్రతీ ఒక్కరు కంటి వైద్య శిబిరానికి వచ్చి నేత్ర పరీక్షలు నిర్వహించుకొని అద్దాలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్యాక్స్ చైర్మన్ బాలకృష్ణ రెడ్డి, ఎంపీపీ నవనీత వి, ఎంపిడివో యాదగిరి రెడ్డి, వైస్ ఎంపీపీ విఠల్ రెడ్డి, పార్టీ అధ్యక్షులు మహేష్, సర్పంచులు నర్సయ్య, అర్జున్, ఆత్మ కమిటీ డైరెక్టర్ బిక్షపతి, నాయకులు ఆంజనేయులు, చంద్రశేఖర్, బిక్షపతి, నరేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.