Friday, September 20, 2024
HomeతెలంగాణBansuvada: బీఆర్ఎస్ ప్లీనరీకి సర్వం సిద్ధం

Bansuvada: బీఆర్ఎస్ ప్లీనరీకి సర్వం సిద్ధం

బాన్సువాడ పట్టణంలోని తన నివాసంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి. ఈసందర్భంగా స్పీకర్ పోచారం మాట్లాడుతూ…ప్రతి ఏడాది భారత రాష్ట్ర సమితి (BRS) పార్టీ ఆవిర్భావ సమావేశం జరపడం ఆనవాయితీ అని, అధికారంలో ఉన్న పార్టీగా , రాష్ట్ర ప్రగతికి, అభివృద్ధికి అవసరమైన తీర్మానాలు ఆవిర్భావ సమావేశంలో జరుగుతాయని గుర్తుచేశారు.

- Advertisement -

ఈ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని దానికి అనుబంధంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో నియోజకవర్గ స్థాయి ప్లీనరీ సమావేశాలు రేపు (ఎప్రిల్ 25, 2023) జరుగుతాయి. మన బాన్సువాడ నియోజకవర్గ స్థాయి ప్లీనరి సమావేశం కొల్లూరు రోడ్డు లోని SMB ఫంక్షన్ హాల్ లో జరుగుతుంది. ఈ ప్లీనరీ సమావేశంలో పార్టీ పదవులలో ఉన్నవారు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, క్రియాశీలక సభ్యులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, నాయకులు మొత్తం పదివేల మంది పాల్గొంటారు.

ముందుగా పార్టీ జెండా ఆవిష్కరణ, అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించడం, తెలంగాణ తల్లి చిత్రపటానికి పూలమాలలు వేయడం జరుగుతుంది. తదుపరి కార్యక్రమం ప్రారంభమవుతుంది. రాష్ట్ర సమావేశంలో ఏ విదంగా తీర్మానాలు ప్రతిపాదిస్తారో అదేవిధంగా రేపటి నియోజకవర్గ స్థాయి ప్లీనరీలో కూడా తీర్మాణాలను ప్రవేశ పెడతారు. నాయకులు, కార్యకర్తలు తమ గ్రామాలలో జెండాలను ఎగురవేసి ర్యాలీగా ఉదయం 9.30 గంటల లోపల సమావేశ ప్రాంగణానికి చేరుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను..క్రమశిక్షణ కలిగిన సైనికుల వలే నాయకులు, కార్యకర్తలు నిబంధనలు పాటించి ఈ సమావేశాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను.

రేపటి BRS పార్టీ ప్లీనరీలో నేను నియోజకవర్గ శాసనసభ్యుడి హోదాలో పాల్గొంటాను. స్థానిక MLA నే ప్లీనరీ సమావేశానికి అధ్యక్షత వహించాలి కాబట్టి రేపటి బాన్సువాడ నియోజకవర్గ స్థాయి సమావేశానికి నేనే అధ్యక్షత వహిస్తాను. నా అధ్యక్షతలోనే ఈ ప్లీనరీ సమావేశం జరుగుతుంది. 10-15 తీర్మానాలు ఉంటాయి. ప్రతి తీర్మానంపై సభ్యులు మాట్లాడుతారు. అనంతరం తీర్మానాన్ని బలపరుస్తారు. మద్యాహ్న భోజనం తదుపరి తీర్మానాలపై చర్చ జరిపి ఆమోదం తెలిపి రాష్ట్ర పార్టీకి పంపుతాం. తీర్మానాలలో మొదటిది వ్యవసాయ రంగం పైన ఉంటుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News