Friday, September 20, 2024
HomeతెలంగాణKarimnagar: రైతులు అధైర్య పడద్దు, ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేస్తాం

Karimnagar: రైతులు అధైర్య పడద్దు, ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేస్తాం

రైతుల అధైర్య పడవద్దని జిల్లాలో రైతులు పండించిన ప్రతిదాన్యం గింజను కోనుగోలు చేస్తామని జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ తెలిపారు. కరీంనగర్ గ్రామీణ మండలం నగునూర్ గ్రామం, చొప్పదండి మండలం చాకుంట గ్రామాలలో సోమవారం నాటి వడగళ్లవాళ, ఇదురుగాలులతో జరిగిన పంటనష్టాన్ని జిల్లా వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ పరిశీలించారు. ఈ సందర్బంగా కరీంనగర్ గ్రామీణ మండలం నగునూర్ గ్రామానికి చెందిన దామరపెల్లి బాపురెడ్డి వరిపంటను, చొప్పదండి మండలం చాకుంట గ్రామంలోని పురం రవి 15 ఎకరాల్లో సాగు చేసిన వరి పంటతో పాటు మరో 4 ఎకరాలలో నష్టపోయిన మిర్చి పంటను పరిశీలించారు. ఈ సందర్బంగా రైతులతో కలెక్టర్ మాట్లాడుతూ, పంటకోతకు వచ్చిన సమయంలో భారీ వర్షాలు, వడగళ్లవానలతో పంటను నష్టపోయిన రైతులేవరు అదైర్యపడోద్దని, ప్రతి రైతుకు పంటనష్టాన్ని ఇప్పించేందుకు నివేదికను సిద్దం చేయించి ప్రభుత్వానికి పంపించడం జరుగుతుందని తెలిపారు. అనంతరం పంటనష్టాన్ని గురించి వ్యవసాయ అధికారులను అడిగితెలుసుకొని వెంటనే పంటనష్ట నివేదికను సిద్దం చేయించాలని ఆదేశించారు.

- Advertisement -

అంతకు ముందు నగునూరు గ్రామంలోని ఐకెపి పాక్స్ కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి తడిసిన దాన్యాన్ని వెంటనే ఆరబెట్టాలని, కొనుగోలు కేంద్రానికి తీసువచ్చిన దాన్యం వర్షాలకు తడవకుండా టార్పలిన్లను వాడాలని తెలిపారు. కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చే దాన్యంలో తాలు వంటివి లేకుండా చూడాలని, దాన్యం తడిసిన కూడా పంటను కొనుగోలు చేయడం జరుగుతుందని తెలిపారు. అంనంతరం కేంద్రం నిర్వహకులతో మాట్లాడుతూ కోనుగోలు కేంద్రానికి వచ్చిన దాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి మిల్లులకు తరలించాలని, ఎక్కడా ఎటువంటి అలసత్వం వహించరాదని తెలిపారు.

ఈ పర్యటనలో జిల్లా వ్యవసాయశాఖ అధికారి శ్రీదర్, చొప్పదండి తహసీల్దార్ సరిత, ఇతర అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News