Friday, September 20, 2024
HomeతెలంగాణKarimnagar: కలెక్టర్ కాళ్ళు మొక్కిన కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు పత్తి కృష్ణారెడ్డి

Karimnagar: కలెక్టర్ కాళ్ళు మొక్కిన కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు పత్తి కృష్ణారెడ్డి

గత రెండు మూడు రోజుల నుండి కురుస్తున్న వడగళ్ల వానల వల్ల జిల్లా వ్యాప్తంగా పంట నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని కోరుతూ మాజీ పార్లమెంట్ సభ్యులు పొన్నం ప్రభాకర్, కరీంనగర్ డిసిసి అధ్యక్షులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షులు పలువురు ముఖ్య నేతల బృందం కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ ఆర్.వి.కర్ణన్ ని కలిసి వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా మాజీ పార్లమెంట్ సభ్యులు పొన్నం ప్రభాకర్, డిసిసి అధ్యక్షులు కవ్వంపల్లి సత్యనారాయణ, కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు పత్తి కృష్ణారెడ్డి తో కలిసి మాట్లాడుతూ జిల్లాలో వడగళ్ల వానలతో నష్టపోయిన రైతాంగాన్ని పలకరిస్తే కన్నీటి పర్యంతం అవుతున్న ఘటన తీవ్ర ఆవేదనకు గురిచేసిందని, ఆదుకోవలసిన రాష్ట్ర ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు పార్టీ ప్లీనరీ సమావేశాలు, ఆత్మీయ సమ్మేళనాలు అంటూ సంబరాలు జరుపుకోవడం నిజంగా సిగ్గుచేటని, గత నెలలో చొప్పదండి నియోజకవర్గం పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ వడగళ్ళ వానాలతో నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకుంటామని 10,000 రూపాయల పరిహారం అందిస్తామని ప్రకటించినప్పటికీ నేటికి ఒక్క రూపాయి రాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గత రెండు రోజుల కింద జిల్లా మంత్రి గంగుల కమలాకర్ నష్టపోయిన కౌలు రైతులకు సైతం చెక్కులు అందిస్తామని ప్రకటించి 48 గంటలు దాటినప్పటికీ ఇప్పటివరకు అతి గతి లేదని, రైతులు మా దృష్టికి తీసుకువచ్చారన్నారు.

- Advertisement -

జిల్లా వ్యాప్తంగా ఎక్కడ చూసినా దెబ్బతిన్న వరి మొక్కజొన్న పత్తి మామిడి పంటలతో రైతులు బోరున వినిపిస్తున్నారని ఇవేవీ బీఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులకు కనిపించడం లేదని ఎద్దేవా చేశారు. రైతులు కన్నీరు పెడుతుంటే కారు, అధికార పార్టీ ప్రచార కార్యక్రమాలలో ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం తీరికలేకుండా తిరుగుతున్నారని, గత 20 రోజులుగా రైతులు ధాన్యాన్ని రోడ్లపై కుప్పలుగా పోసి స్పష్టంగా కనబడుతున్నప్పటికీ, కొబ్బరికాయలు కొట్టడానికి పరిమితమైన ఐకెపి సెంటర్లు సకాలంలో ప్రారంభించకపోవడంతో వర్షానికి వరి ధాన్యం తడిసి రైతులు తీవ్రంగా నష్టపోయారని, వాతావరణ హెచ్చరికలు ఉన్నప్పటికీ ప్రభుత్వం ధాన్యం కొనుగోలుకు సంబంధించి గన్ని సంచులు ఏర్పాటు చేయడం, హమాలీలను అందుబాటులో ఉంచడం లాంటి ఏర్పాట్లు చేయలేదని, ఈ పరిస్థితులకు ప్రభుత్వమే బాధ్యత వహిస్తూ వెంటనే రైతులను ఆదుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన రైతులకు మద్దతుగా పెద్ద ఎత్తున ఉద్యమం చేపడుతామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో నగర కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి నాయకులు రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు చెర్ల పద్మ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి రహమత్ హుస్సేన్ ఎండి తాజ్ మడుపు మోహన్ పులి ఆంజనేయులు గౌడ్ శ్రావణ్ నాయక్ మేనేనీ రోహిత్ రావు అబ్దుల్ రెహమాన్ నాగి శేఖర్ కుర్ర పోచయ్య సయ్యద్ అఖిల్ కొమ్మెర బోయిన రవీందర్ రెడ్డి వెన్న రాజ మల్లయ్య మల్యాల సుజిత్ కుమార్ పురం రాజేశం గుండారపు శ్రీనివాస్ పల్లెని రవీందర్రావు ముద్దసాని రంగన్న రామిడి రాజిరెడ్డి సాయిళ్ళ రాజు దుబాసి బాబు సాహెబ్ హుస్సేన్ పొన్నం శ్రీనివాస్ గుండాటి శ్రీనివాస్ రెడ్డి కామెడీ రామ్ రెడ్డి కంకణాల అనిల్ కుమార్ గుప్తా మెతుకు కాంతయ్య బొబ్బిలి విక్టర్ నిహాల్ అహ్మద్ సలీమ్ ఉద్దీన్ లైక్ ఎర్ర శ్రీనివాస్ పులి విజయ్ హరీష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News