భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఇల్లందకుంట మండల పరిధిలోని గ్రామ గ్రామాన బీఆర్ఎస్ నాయకులు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు జెండా ఆవిష్కరించి ఘనంగా జరుపుకున్నారు. ఇల్లందకుంట మండలం బూజూనూర్ గ్రామంలో ఎంపీపీ సరిగొమ్ముల పావనివెంకటేష్ అధ్వర్యంలో భారత రాష్ట్ర సమితి పార్టీ జెండాను ఆవిష్కరించి మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ పావని వెంకటేష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో అలుపెరుగని పోరాటం చేసిన ఉద్యమకారుడిగా ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమంతో పాటు రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు రాష్ట్ర ప్రజానీకం ఎల్లవేళలా కృతజ్ఞతా భావంతో ఉంటుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశంలోని ,ఏ ఇతర రాష్ట్రాలలో అమలు కావడం లేదన్నారు.
ముఖ్యమంత్రి కెసిఆర్ రాష్ట్రంలో అమలు చేస్తున్న రైతుబంధు, రైతు బీమా, కల్యాణ లక్ష్మి పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తుండడం తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ గర్వకారణమన్నారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ నాయకులు సోమిడి చేరాలు, ఉప సర్పంచ్ భూషవేని మల్లయ్య, పిఎసిఎస్ డైరెక్టర్ ఎగ్గటి జగన్, కుమార్, వంశీ, విజయ్, హరీష్, అనిల్, కరన్, ఎడ్ల సమ్మిరెడ్డి, బురుగుల అయిలు, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.