ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకొని జమ్మికుంట మండలం వావిలాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిని డాక్టర్ సనా జవేరియా ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది వావిలాల గ్రామంలో ప్రపంచ మలేరియా దినోత్సవం ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యాధికారిని మాట్లాడుతూ, మలేరియా వ్యాధి నిర్మూలన, ప్రజలలో ఈ వ్యాధి పట్ల అవగాహన కల్పించడం ప్రపంచ మలేరియా దినోత్సవం ముఖ్య ఉద్దేశం అన్నారు.
(2008) సంవత్సరం మొదలుకొని, ప్రతి సంవత్సరం ఏప్రిల్( 25).న . ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుతున్నారు. మలేరియా వ్యాప్తి సాధారణంగా దోమకాటు వలన జరుగుతుందని మనిషిని కుట్టినప్పుడు లాలాజలాన్ని వదులుతుందని ఆ లాలాజలములో స్పోరోజాయిట్స్ ఉండడంతో అవి మనిషి శరీరములోకి ప్రవేశించి అక్కడ నుండి అవి మీరోజాయిట్స్ గా కాలేయము, ఎర్ర రక్త కణాలలో పరిణతి చెందుతాయన్నారు. ఇలా పరిణతి చెందిన మీరోజాయిట్స్ వల్ల వ్యాధి లక్షణాలు కనిపించడం జరుగుతుందన్నారు.
ఈ ర్యాలీ లో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ శంకర్ రెడ్డి, సూపర్వైజర్స్ రత్నకుమారి, అరుణ , సాంబయ్య,హెల్త్ అసిస్టెంట్ నరేందర్, NCD స్టాఫ్ నర్స్ స్వప్న, ల్యాబ్ టెక్నీషియన్ రామకృష్ణ, ఆరోగ్యశాఖ సిబ్బంది తో పాటు తదితరులు పాల్గొన్నారు.