Saturday, November 23, 2024
HomeతెలంగాణPalakurthi: BRS పార్టీ ప్రతినిధుల మహా సభ

Palakurthi: BRS పార్టీ ప్రతినిధుల మహా సభ

మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధ్యక్షతన దేవరుప్పులలో పాలకుర్తి నియోజకవర్గ BRS సభ ఘనంగా సాగింది. సభా ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన BRS పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు మంత్రి ఎర్రబెల్లి. పాలకుర్తి ప్లీనరీలో మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు కామెంట్స్:

- Advertisement -

ప్లీనరీలో చేసే తీర్మానాలపై గ్రామాల్లో చర్చ జరగాలి, దేశంలో ఏ శాఖకు రానన్ని అవార్డులు… ఏ మంత్రి సాధించనన్ని అవార్డులు నేను ప్రాతినిధ్యం వహిస్తున్న శాఖకు రావడం గర్వకారణం అంటూ ఆయన ప్రసంగం సాగింది. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అన్ని రంగాల్లో దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని, కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో తెలంగాణలో తేడాపై ప్రతీ గ్రామంలో చర్చ జరగాలన్నారు. బండి సంజయ్ నీకు సిగ్గుందా? అంటూ నిలదీసిన ఎర్రబెల్లి ..బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా నష్టపరిహారం 20వేలు ఇస్తున్నారా..? ఇక్కడ ఎలా అడుగుతున్నారు? ఎకరానికి రూ. 10వేలు ఇస్తున్న దేవుడు కేసీఆర్… నీకు సిగ్గుంటే, దమ్ముంటే కేంద్రం నుండి మరో పది వేలు ఇప్పించాలి అంటూ డిమాండ్ చేశారు.

భార‌త రాష్ట్ర స‌మితి పార్టీ పాల‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గం ప్లీన‌రీ తీర్మానాలు..

  1. నూత‌నంగా నిర్మించిన పార్ల‌మెంట్ భ‌వ‌నానికి రాజ్యాంగ నిర్మాత డాక్ట‌ర్ బి.ఆర్‌. అంబేద్క‌ర్ గారి పేరు పెట్టాలి.
  2. కేంద్రంలోని బిజెపి ప్ర‌భుత్వం వెంట‌నే బీసీ కుల గ‌ణ‌న చేప‌ట్టాలి.
  3. తెలంగాణ రాష్ట్రానికి ఉపాధి హామీ నిధులకు కేంద్రం కోత విధించింది. అలాగే ఉపాధి హామీని వ్య‌వ‌సాయానికి అనుసంధానం చేయాలి.
  4. తెలంగాణ‌కు మ‌ణిహారం మ‌న సింగ‌రేణిని ప్రైవేట్ ప‌రం చేయ‌వ‌ద్దు. సింగ‌రేణిలో వేలం పాట‌లు ఆపాలి. సింగ‌రేణిని గుజ‌రాత్ గ్లానైట్ గ‌నుల లాగే తెలంగాణ‌కు అప్ప‌గించాలి. కార్మికుల పొట్ట కొట్ట‌వ‌ద్దు.
  5. కేంద్ర ప్ర‌భుత్వం పెంచిన వంట‌ గ్యాస్‌, పెట్రోల్‌, డీజిల్, నిత్యావ‌స‌ర స‌రుకుల ధ‌ర‌ల‌ను వెంట‌నే త‌గ్గించాలి.
  6. రాష్ట్ర విభ‌జ‌న సంద‌ర్భంగా తెలంగాణ‌కు ఇచ్చిన అన్ని విభ‌జన హామీల‌ను వెంట‌నే నెర‌వేర్చాలి
  7. తెలంగాణ హ‌క్కు బ‌య్యారం ఉక్కు… బ‌య్యారంలో వెంట‌నే ఉక్కు ఫ్యాక్ట‌రీని మంజూరు చేయాలి
  8. వ‌రంగ‌ల్ ప్ర‌జ‌ల చిర‌కాల కోరిక‌… కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్ట‌రీని వెంట‌నే ఇవ్వాలి.
  9. ములుగులో స్థ‌లాన్ని కేటాయించిన‌ప్ప‌టికీ, గిరిజ‌న యూనివర్సిటీ ని మంజూరు చేయ‌కుండా జాప్యం చేస్తున్న కేంద్ర వైఖ‌రిని నిర‌సిస్తూ, వెంట‌నే గిరిజ‌న యూనివర్సిటీని మంజూరు చేయాల‌ని డిమాండ్ చేస్తున్నాం.
  10. తెలంగాణ‌లో ప్ర‌తిష్టాత్మ‌కంగా, రికార్డు స్థాయిలో అతి త‌క్కువ కాలంలో ప్ర‌పంచంలోనే అతి పెద్ద ఎత్తిపోత‌ల ప‌థ‌కం కాళేశ్వ‌రం ప్రాజెక్టుకు జాతీయ హోదా క‌ల్పించి, నిర్మాణ ఖ‌ర్చును ఇవ్వాలి
  11. రాష్ట్రానికి హ‌క్కుగా రావాల్సిన నిధుల‌ను వెంట‌నే విడుద‌ల చేయాలి
  12. మ‌న మిష‌న్ భ‌గీర‌థ ప‌థ‌కాన్ని కేంద్ర ప్ర‌భుత్వం కాపీ కొట్టి హ‌ర్ ఘ‌ర్ జ‌ల్ అంటూ జ‌ల్ జీవ‌న్‌ మిష‌న్ ను అమ‌లు చేస్తున్న‌ది. మిష‌న్ భ‌గీర‌థ ప‌థ‌కాన్ని ప్రధాన మంత్రి మోడీ ప్రారంభించారు. ద‌శాబ్దాల ఫ్లోరైడ్ ను పార‌దోలాం. దేశంలోనే మొద‌టి సారిగా ఇంటింటికీ న‌ల్లాల ద్వారా నీటిని అందిస్తున్నం. కేంద్రం స్వ‌యంగా అనేక అవార్డులు ఇచ్చింది. నీతి ఆయోగ్ మిష‌న్ భ‌గీర‌థ ప‌థ‌కానికి 19వేల కోట్ల రూపాయ‌ల‌ను తెలంగాణ‌కు ఇవ్వాల‌ని చెప్పినా, ఇవ్వ‌డం లేదు. వెంట‌నే మిష‌న్ భ‌గీర‌థ‌కు నిధులు విడుద‌ల చేయాలి.
  13. బిజెపి కేంద్రంలో అధికారంలోకి వ‌స్తే ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలిస్తామ‌ని చెప్పి నిరుద్యోగుల‌ను మోసం చేసినందుకు బిజెపి ని నిల‌దీయాలి.
  14. దేశంలో మ‌త చిచ్చు పెట్టి, ప్ర‌జ‌ల మ‌ధ్య విద్వేషాల‌ను రెచ్చ‌గొట్టే బిజెపి ప్ర‌భుత్వాన్ని వెంట‌నే గ‌ద్దె దించాలి
  15. తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేసి, పార్ల‌మెంట్ కు పంపిన‌ ఎస్సీల వ‌ర్గీక‌ర‌ణ‌ను కేంద్ర ప్ర‌భుత్వం వెంట‌నే ఆమోదించాలి

భార‌త రాష్ట్ర స‌మితి పార్టీ పాల‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గం ప్లీన‌రీ అభినంద‌న తీర్మానాలు

1.హైద‌రాబాద్ లో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్‌. అంబేద్క‌ర్ గారి 125 అడుగుల భారీ విగ్ర‌హాన్ని ఏర్పాటు చేసిన గౌవ‌ర సిఎం శ్రీ కెసిఆర్‌ గారికి కృత‌జ్ఞ‌త‌లు, ధ‌న్య‌వాదాలు

  1. నూత‌నంగా నిర్మించిన తెలంగాణ రాష్ట్ర స‌చివాల‌యానికి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్‌. అంబేద్క‌ర్ గారి పేరు పెట్టిన‌ గౌవ‌ర సిఎం శ్రీ కెసిఆర్‌ గారికి కృత‌జ్ఞ‌త‌లు, ధ‌న్య‌వాదాలు
  2. హైద‌రాబాద్ లో అన్ని సామాజిక వ‌ర్గాల‌కు ఆత్మ‌గౌర‌వ భ‌వ‌నాలు నిర్మించిన మ‌న గౌవ‌ర సిఎం శ్రీ కెసిఆర్‌ గారికి కృత‌జ్ఞ‌త‌లు, ధ‌న్య‌వాదాలు
  3. ఎస్టీల‌కు 12శాతం రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించిన మ‌న గౌవ‌ర సిఎం శ్రీ కెసిఆర్‌ గారికి కృత‌జ్ఞ‌త‌లు, ధ‌న్య‌వాదాలు
  4. దేశంలో ఏ రాష్ట్ర ప్ర‌భుత్వం చేయ‌ని విధంగా ఎస్సీల‌కు ద‌ళిత బంధు అందించిన మ‌న గౌవ‌ర సిఎం శ్రీ కెసిఆర్‌ గారికి కృత‌జ్ఞ‌త‌లు, ధ‌న్య‌వాదాలు
  5. ప‌రిపాల‌నా సౌల‌భ్యమే గాక‌, ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు పాల‌న‌ను తీసుకు వ‌స్తూ, కొత్త జిల్లాలు, మండ‌లాలు, గ్రామ పంచాయ‌తీలు, తండాలు, గూడాల‌ను గ్రామ పంచాయ‌తీలుగా ఏర్పాటు చేసి, నూత‌న క‌లెక్ట‌ర్‌ భ‌వ‌నాల‌ను నిర్మించిన మ‌న గౌవ‌ర సిఎం శ్రీ కెసిఆర్‌ గారికి కృత‌జ్ఞ‌త‌లు, ధ‌న్య‌వాదాలు
  6. కేంద్ర ప్ర‌భుత్వం అన్ని రాష్ట్రాల‌కు మెడిక‌ల్ కాలేజీలు మంజూరు చేసి, తెలంగాణ రాష్ట్రానికి ఒక్క మెడిక‌ల్ కాలేజీ ఇవ్వ‌క‌పోయినా, రాష్ట్ర ప్ర‌భుత్వ‌మే ప్ర‌తి జిల్లాకు ఒక మెడిక‌ల్ కాలేజీని ఏర్పాటు చేస్తున్న మ‌న గౌవ‌ర సిఎం శ్రీ కెసిఆర్‌ గారికి కృత‌జ్ఞ‌త‌లు, ధ‌న్య‌వాదాలు
  7. కేంద్రం చేతులెత్తేసినా, ధాన్యం కొన‌బోమని మొండికేసినా, దేశంలో ఎక్క‌డా లేని విధంగా తెలంగాణ‌లో రైతుల వ‌ద్ద‌నే కొనుగోలు కేంద్రాల‌ను ఏర్పాటు చేసి, రైతులు పండించిన మొత్తం ధాన్యాన్ని గిట్టుబాటు ధ‌ర‌తో కొనుగోలు చేస్తున్న మ‌న గౌవ‌ర సిఎం శ్రీ కెసిఆర్‌ గారికి కృత‌జ్ఞ‌త‌లు, ధ‌న్య‌వాదాలు
  8. దేశంలో ఎక్క‌డా లేని విధంగా పంట న‌ష్టాల‌కు ప‌రిహారంగా ఎక‌రాకు 10వేల రూపాయ‌లు ఇస్తున్న మ‌న‌సున్న మ‌హ‌రాజు మ‌న గౌవ‌ర సిఎం శ్రీ కెసిఆర్‌ గారికి కృత‌జ్ఞ‌త‌లు, ధ‌న్య‌వాదాలు

ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు, ఎర్రబెల్లి ట్రస్ చైర్ పర్సన్ శ్రీమతి ఎర్రబెల్లి ఉషా దయాకర్ రావు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ నెమరు గొమ్ముల సుధాకర్ రావు, నియోజకవర్గంలోని వివిధ మండలాల స్థానిక ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News