బనగానపల్లి మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం టంగుటూరు సచివాలయం తమ్మడపల్లి పరిధిలోని రాళ్ల కొత్తూరు తాండ గ్రామంలో మలేరియా ర్యాలీ చేపట్జారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్రీ సిహెచ్ఎస్ శివ శంకరుడు, ఎంపీహెచ్వో ఎన్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మలేరియా అనేది దోమకాటుతో సంక్రమిస్తుందని, మలేరియా దోమ కుట్టిన పది నుంచి 15 రోజుల తర్వాత మలేరియా లక్షణాలు అనగా చలితో కూడిన జ్వరం వాంతులు తలనొప్పి మొదలగు లక్షణాలు కనబడతాయని, కనపడిన వెంటనే అందుబాటులో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ గారిని, మరియు సిబ్బందిని గాని కలిసి చికిత్స తీసుకోవాలని సూచించారు. మలేరియా చాలా ప్రాణాంతకమైన వ్యాధి కావున ప్రతి ఒక్కరు జాగ్రత్తకుపాటించి దోమల కొట్టకుండా దోమతెరలు వాడడం మరియు ఇంటిలోని కిటికీలకు మెస్సు వాడాలి పరిసరాల శుభ్రత మరియు ఇంటి బయట కాలువలు శుభ్రంగా ఉంచుకోవాలి మలేరియా రాకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించి ఎవరికి గాని మలేరియా జ్వరం రాకుండా జాగ్రత్తగా ఉండి మలేరియా రహిత ప్రపంచాన్ని చూడాలని వెల్లడించారు. రాళ్ల కొత్తూరు తండాలో ఫ్యామిలీ డాక్టర్ పోగ్రామ్ జరపడం జరిగింది ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సిహెచ్ఎస్ శివ శంకరుడు ఎంపీహెచ్వో ఎన్ వెంకటేశ్వర్లు ఏఎన్ఎం సరస్వతి ఎమ్మెల్యే హెచ్ పి అరుణ, ఆశ తదితరులు పాల్గొన్నారు.
World Malariya Day: మలేరియా డే ర్యాలీ
సంబంధిత వార్తలు | RELATED ARTICLES