Sunday, September 22, 2024
Homeనేషనల్Pet Dog Birthday : ప్ర‌తీ కుక్క కు ఓ రోజు అంటే ఇదేనేమో..!

Pet Dog Birthday : ప్ర‌తీ కుక్క కు ఓ రోజు అంటే ఇదేనేమో..!

Pet Dog Birthday : కొందరికి పెంపుడు జంతువులంటే చెప్పలేనంత ప్రేమ. వాటిని త‌మ కుటుంబంలోని సొంత స‌భ్యులుగా చూసుకుంటారు. అంతేనా.. వాటికి బ‌ట్ట‌లు తొడ‌గ‌డం,పెళిళ్లు చేయ‌డం, సీమంతం వంటి ఫంక్ష‌న్లు చేయ‌డం ఇటీవ‌ల ఓ ట్రెండ్‌గా మారిపోయింది. జార్ఖండ్ రాష్ట్రంలోని ధ‌న్‌బాద్‌లోని ఓ కుటుంబం కూడా త‌మ పెంపుడు కుక్క‌కు పుట్టిన రోజు వేడుక‌ల‌ను నిర్వ‌హించారు. ఇందులో ఏముంది ఇటీవ‌ల అంద‌రూ చేస్తున్నారుగా అంటారా..? అక్క‌డికే వ‌స్తున్నాం ఆగండి. సాధాసీదాగా చేస్తే మ‌నం ఎందుకు చెప్పుకుంటాం.

- Advertisement -

జార్ఖండ్‌లోని ధ‌న్‌బాద్‌లో సుమిత్ర కుమారి అనే మ‌హిళ త‌న కుటుంబంతో క‌లిసి నివ‌సిస్తోంది. ఈమె ఓ కుక్క‌ను పెంచుకుంటోంది. దానికి ముద్దుగా ‘ఆస్కార్’ అని పేరు పెట్టుకుంది. న‌వంబ‌ర్ 29న దాటి పుట్టిన రోజు వేడుక‌ను ఎంతో ఘ‌నంగా నిర్వ‌హించింది. 350 మందికి పైగా అతిథులను ఆస్కార్ పుట్టిన రోజు వేడుక‌ల‌కు ఆహ్వానించింది.

ఆస్కార్ కోస‌మ‌ని రూ.4,500 విలువైన స్పెష‌ల్ సూట్ ను రెడీ చేయించి దానికి వేసింది. అతిథులు అంద‌రి స‌మ‌క్షంలో దాని చేత కేక్ క‌ట్ చేయించింది. కేక్ కటింగ్‌కు ముందు హార‌తి ఇచ్చారు. ఇక అథితులు కూడా ఆస్కార్ కోసం బ‌హుమ‌తులు తీసుకువ‌చ్చారు. అందులో మూడు బంగారు లాకెట్లు కూడా ఉన్నాయి. ఆస్కార్ పుట్టిన రోజు వేడుక‌ల‌కు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఈ వీడియోలో.. కుక్క చెంప‌పై మ‌హిళ ముద్దు పెట్ట‌డాన్ని చూడొచ్చు. టేబుల్ పైన భారీ కేక్ కూడా ఈ వీడియోలో క‌నిపిస్తుంది.

ఆస్కార్ త‌మ కుటుంబ స‌భ్యుల్లో ఒక‌రిని చెప్పారు సందీప్‌. తాము ఏదీ తింటే అదే తింటుంద‌ని చెప్పాడు. 20 రోజుల వ‌య‌స్సు ఉన్న‌ప్పుడు దాన్ని ఇంటికి తీసుకువ‌చ్చి పెంచుకున్న‌ట్లు తెలిపాడు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News