మెట్పల్లి మున్సిపల్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం జరిగింది. మున్సిపల్ చైర్మన్ రానావేని సుజాత సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు పాల్గొన్నారు. ఇటీవల మరణించిన మాజీ ఎమ్మెల్యే కొమిరెడ్డి రాములు ఆత్మ శాంతించాలని రెండు నిమిషాలు మౌనం పాటించారు అలాగే వ్యవసాయ మార్కెట్ ఆయన పేరు పెట్టాలని రెండో వార్డు కౌన్సిలర్ ఎమ్మెల్యే కు విన్నవించారు. ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు మిషన్ భగీరథ అధికారులకి ఈ వారం పది రోజుల్లో లోపల అన్ని వార్డుల మిషన్ భగీరథ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. పెద్ద చెరువు వద్ద బతుకమ్మ ఘాటు ఏర్పాటు పనులు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు.
సమావేశంలో 19 అంశాలు చర్చించి ఏకగ్రీవంగా కౌన్సిల్ తీర్మానం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాణవేణి సుజాత సత్యనారాయణ, వైస్ చైర్మన్ బోయినపల్లి చంద్రశేఖర రావు, కమిషనర్ జగదీశ్వర్ గౌడ్, కౌన్సిలర్స్ కోఆప్షన్ సభ్యులు తదితరులు వివిధ శాఖల ఉన్నత అధికారులు పాల్గొన్నారు.