Saturday, November 23, 2024
HomeతెలంగాణPaleru: తడిచిన ప్రతి ధాన్యం గింజ కొంటాం: పల్లా

Paleru: తడిచిన ప్రతి ధాన్యం గింజ కొంటాం: పల్లా

పాలేరు నియోజకవర్గంలో ఇటీవల కురిసిన అకాల వర్షాలకు రైతులు పండించిన ధాన్యం తడిచిపోయింది. మిల్లర్లు ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడంతో రైతులు ఈ విషయాన్ని ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే స్పందించిన ఆయన సూచన మేరకు వివిధ మండలాల BRS పార్టీ నాయకుల ఈరోజు హైదరాబాద్ వెళ్లి రాష్ట్ర రైతు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. తక్షణమే పల్లా రాజేశ్వర్ రెడ్డి స్పందించి ధాన్యం కొనుగోలు విషయం పై పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ కు, ఆ శాఖ కార్యదర్శి కి తెలియజేశారు. వెంటనే వారు తడిచిన ప్రతి ధాన్యం గింజ కొనుగోలు చేయాలని మిల్లర్లు సహకరించకుంటే వారిపై చర్యలు తీసుకోవాలని ఖమ్మం సివిల్ సప్లై అధికారులను ఆదేశించారు. అవసరమైతే ధాన్యాన్ని సివిల్ సప్లై అధికారులే కొనుగోలు చేసి స్టాక్ పాయింట్ ఏర్పాటు చేయాలని సూచించారు.అధికారులు స్టాక్ పెట్టాలని సూచించారు తమ సమస్యను విని వెంటనే పరిష్కరించిన పల్లా రాజేశ్వర్ రెడ్డి, మంత్రి గంగుల కమలాకర్ కు,ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి కి రైతులు కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ లు ఇంటూరి శేఖర్,డీసీఎంఎస్ డైరెక్టర్ నాగ బండి శ్రీనివాసరావు చావా వేణు, కూసుమంచి మండల పార్టీ అధ్యక్ష కార్యదర్శులు వేముల వీరయ్య, ఆసిఫ్ పాషా, రూరల్ మండల అధ్యక్షుడు బెల్లం వేణు, నెలకొండపల్లి మండల అధ్యక్షుడు ఉన్నం బ్రహ్మయ్య రూరల్ జడ్పీటీసీ వర ప్రసాద్, ఆత్మకమిటీ చైర్మన్ బాలకృష్ణారెడ్డి, మండల రైతు సమితి అధ్యక్షుడు శాఖమూరి సతీష్, కూసుమంచి ఎంపీపీ బానోత్ శ్రీనివాస్, ఆత్మ నేలకొండపల్లి సొసైటీ చైర్మన్ కోటి సైదిరెడ్డి. సుడా డైరెక్టర్ సంజీవరెడ్డి నాయకులు మరికంటి రేణుబాబు. అనగాని నరసింహారావు, పలువురు రైతులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News