భారతీయ జనతా పార్టీపై బిఆర్ఎస్ నాయకులు విమర్శలు చేసే స్థాయి మీకు లేదని తాండూర్ నియోజకవర్గం బిజెపి అసెంబ్లీ కన్వీనర్ రజనీకాంత్ ఓ ప్రకటనలో తెలిపారు. నియోజకవర్గంలోని యాలాల మండలంలో బిఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసిన ప్లీనరీ సమావేశంలో బిజెపి నాయకులపై బిఆర్ఎస్ నాయకులు చేసిన వ్యాఖ్యలను రజనీకాంత్ ఖండించారు. భూ కబ్జాలు, దో నెంబర్ దందాలు, రౌడీయిజం చేసేది బిఆర్ఎస్ నాయకులే అని అన్నారు. భారత ప్రధాని నరేందర్ మోడీని విమర్శించే స్థాయి మికు లేదని విమర్శించారు. ఈ సందర్భంగా దమ్ముంటే తాండూర్ నియోజకవర్గంలో ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యేగా పోటీ చేయాలని సవాల్ విసిరారు. బిఆర్ఎస్, ఎంఐఎం పొత్తులేకుండా ఎమ్మెల్యే బరిలో నిలబడే దమ్ము మీకుందా అంటూ ఎంఐఎం నాయకులను ప్రశ్నించారు. భారతీయ జనతా పార్టీపై బిఆర్ఎస్ ఎంఐఎం నాయకులు విమర్శలు చేస్తే సహించేది లేదని, జోకుడు రాజకీయాలు చేయొద్దని ఆరోపించారు. రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది, తాండూరులో బిజెపి జెండా ఎగురవేస్తాం అని ధీమా వ్యక్తం చేశారు.