Saturday, October 5, 2024
HomeఆటRicky Ponting : రికీ పాంటింగ్‌కు తీవ్ర అస్వస్థత.. ఆస్ప‌త్రికి త‌ర‌లింపు

Ricky Ponting : రికీ పాంటింగ్‌కు తీవ్ర అస్వస్థత.. ఆస్ప‌త్రికి త‌ర‌లింపు

Ricky Ponting : ఆస్ట్రేలియా దిగ్గ‌జ ఆట‌గాడు రికీ పాంటింగ్ తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గురైయ్యాడు. వెంట‌నే అత‌డిని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన త‌రువాత పాంటింగ్ కామెంటేట‌ర్ అవ‌తారం ఎత్తాడు. పెర్త్ వేదిక‌గా వెస్టిండీస్‌, ఆస్ట్రేలియా జ‌ట్ల మ‌ధ్య జ‌ర‌గుతున్న తొలి టెస్టుకు కామెంటేట‌ర్‌గా విధులు నిర్వ‌ర్తిస్తున్నాడు. శుక్ర‌వారం తొలి టెస్టు మూడో రోజు ఆట ప్రారంభ‌మైన కాసేప‌టికే కామెంట‌రీ చేస్తున్న పాంటింగ్‌కు ఛాతీలో నొప్పిగా అనిపించింది.

- Advertisement -

వెంట‌నే అత‌డిని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. అత‌డికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్ర‌స్తుతానికి పాంటింగ్ ఆరోగ్యం నిల‌క‌డ‌గా ఉన్న‌ట్లు సమాచారం. ఇక పాంటింగ్ ఆస్ప‌త్రిలో చేరాడు అన్న స‌మాచారం తెలుసుకున్న అత‌డి అభిమానులు ఆందోళ‌న చెందుతున్నారు. అత‌డు కోలుకుని క్షేమంగా తిరిగి రావాల‌ని ఆకాంక్షిస్తున్నారు.

క్రికెట్ ఆస్ట్రేలియా చ‌రిత్ర‌లో పాంటింగ్ ది ప్ర‌త్యేక‌మైన స్థానం. 1995 నుంచి 2012 వ‌ర‌కు ఆస్ట్రేలియాకు ప్రాతినిథ్యం వ‌హించాడు. వ‌న్డే క్రికెట్‌లో ఆస్ట్రేలియాకు రెండు ప్ర‌పంచ‌క‌ప్‌లు అందించిన కెప్టెన్‌గా ఘ‌న‌త అందుకున్నాడు. బ్యాటింగ్‌లో ఆల్‌టైం గ్రేట్ బ్యాట‌ర్ల‌ల‌లో ఒక‌డిగా నిలిచాడు. 168 టెస్టుల్లో 13,378, 375 వ‌న్డేల్లో 13,704 ప‌రుగులు చేశాడు. అంత‌ర్జాతీయ క్రికెట్‌లో పాంటింగ్ 71 శ‌త‌కాలు చేశాడు. టెస్టుల్లో 41 సెంచ‌రీలు చేయ‌గా వ‌న్డేల్లో 30 శ‌త‌కాలు చేశాడు.

2012లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన పాంటింగ్‌ ప్రస్తుతం కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్నాడు. అలాగే ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు హెడ్‌ కోచ్‌గా ఉంటున్నాడు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News