Friday, September 20, 2024
HomeతెలంగాణMallapur: అక్రమ కట్టడాన్ని నిలిపివేయాలి: బీజేపీ

Mallapur: అక్రమ కట్టడాన్ని నిలిపివేయాలి: బీజేపీ

మల్లాపూర్ మండల కేంద్రంలో సహకార సంఘం గోదాం వద్ద అక్రమంగా రోడ్డును ఆక్రమించికొని చేపట్టిన నిర్మాణాన్ని నిలుపుదల చేయాలనీ కోరుతూ ఎంపీవోకు బీజేపీ నాయకులు వినతిపత్రం సమర్పించారు. కొద్ది రోజుల క్రితం కలెక్టర్కు మల్లాపూర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో ఇదివరకు వినతిపత్రం అందించినా కూడా దీనిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని వారు ఆవేదన వ్యక్తంచేశారు. ఈ అక్రమ కట్టడాన్ని అడ్డుకునేలా తక్షణం చర్యలు తీసుకోవాలని మల్లాపూర్ పట్టణ భారతీయ జనతా పార్టీ నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యదర్శి ఎర్ర లక్ష్మి, మల్లాపూర్ పట్టణ అధ్యక్షులు లవంగ శివ, బీజేవైఎం ప్రధానకార్యదర్శి రాఖి పటేల్, శక్తి కేంద్రాల ఇంచార్జి పుప్పాల మహేష్, ధనుష్, డా. నరేందర్, సురేష్ లు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News