Friday, November 22, 2024
Homeఆంధ్రప్రదేశ్Peddireddy: గ్రామ వార్డు సచివాలయంలో కూడా విద్యుత్ ఫిర్యాదులు

Peddireddy: గ్రామ వార్డు సచివాలయంలో కూడా విద్యుత్ ఫిర్యాదులు

తిరుపతి కలెక్టరేట్ లో పోర్టల్ ను ప్రారంభించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ..ఇకపై గ్రామ వార్డు సచివాలయాల్లోనూ విద్యుత్ ఫిర్యాదులు స్వీకరిస్తారని వెల్లడించారు. దీంతో ఎస్పిడిసిఎల్ పరిధిలో ఇకపై సచివాలయంలో కూడా విద్యుత్ ఫిర్యాదులు స్వీకరణ మొదలుకానుంది. గత ఏడాది అత్యధికంగా ఒక రోజులో 232 మిలియన్ యూనిట్లు వినియోగిస్తే… ఈ ఏడాది 248 మిలియన్ యూనిట్లు అందించినట్టు .. ఎక్కడా విద్యుత్ అంతరాయం లేకుండా సరఫరా చేస్తున్నట్టు వెల్లడించారు.

- Advertisement -

రాష్ట్ర అభివృద్ధికి ఇది ఒక నిదర్శనమని, పరిశ్రమలకు నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నామన్నారు. అధికారులు శ్రమిస్తున్నారని, మరింత బాధ్యతతో పని చేయాలని పెద్దిరెడ్డి అన్నారు. గ్రామ, వార్డ్ సచివాలయంలో ఫిర్యాదులు కోసం పోర్టల్ ప్రారంభించినట్టు, రైతులను, గ్రామీణ ప్రాంత ప్రజలకు ఇది ఉపయోగపడుతుందన్నారు. ఇంతకుముందు 45 సేవలు అందించేవరని, తాజాగా మరో 12 సేవలు పొందుపరిచినట్టు ఆయవ చెప్పుకొచ్చారు. సచివాలయంలో ఫిర్యాదు ద్వారా స్థానికంగా ఉండే అధికారులు మరింత బాధ్యతగా వ్యవహరిస్తారని, ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కోరారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News