రాష్ట్రంలో యువగళం పాదయాత్ర నిర్వహిస్తూ తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రివర్యులు నారా లోకేష్ ఉదయం 10 గంటలకు మంత్రాలయం నియోజవర్గం నుండి ఎమ్మిగనూరు నియోజకవర్గం నందవరం మండలంలోని ఇబ్రహీంపురం గ్రామం చేరుకున్నారు. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎమ్మిగనూరు మాజీ శాసనసభ్యులు బి వి జయనాగేశ్వర్ రెడ్డి, మాజీ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ పుష్పావతి, మాజీ జిల్లా ఉపాధ్యక్షులు నాగరాజు గౌడ్, మండల క్లస్టర్ ఇంచార్జ్ ఖాశిం వలి, రాష్ట్ర బీసీ సెల్ ఉపాధ్యక్షులు ఈరన్న గౌడ్, మండల కన్వీనర్ చిన్న రాముడు, ఇబ్రహీంపురం గ్రామ టిడిపి నాయకురాలు శంకరమ్మ ఆధ్వర్యంలో యువగళం రథసారథి నారా లోకేష్ కు ఘన స్వాగతం పలికారు. అనంతరం యువగళం పాదయాత్రలో ఇబ్రహీంపురం, ఐ కొట్టాల, మాచాపురం గ్రామం మీదగా నందవరం గ్రామం చేరుకున్నారు. పాదయాత్రలో ఆయా గ్రామాల ప్రజలు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కి వైసిపి ప్రభుత్వం లో ప్రజలకు జరుగుతున్న అన్యాయాలను వివరిస్తూ రాబోవు రోజులలోనైన ప్రజలందరికీ సమన్యాయం జరిగేలా చూడాలని వినతి పత్రాలు అందజేశారు. అనంతరం మాచాపురం గ్రామ శివారులో ఏర్పాటు చేసిన విశ్రాంతి ప్రాంగణమునందు రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వైసీపీ ప్రభుత్వంలో నాయకులు పేరుకు మాత్రమే మాది రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటున్నారు కానీ… రైతుల సాగు నీరు కోసం ఏర్పాటు చేసిన ఆర్డీఎస్ ప్రాజెక్టు నిర్మాణంలో ఏ నమాత్రం చలనం లేదని, అదేవిధంగా గురు రాఘవేంద్ర ఎత్తు పోతుల పథకాల ద్వారా ఆయికట్టు ప్రాంతాలకు కూడా సరైన సాగు నీటి వసతి అందించే పరిస్థితిలో వైసిపి ప్రభుత్వం లేదని రైతులు తమ గోడును విన్నవించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన రైతులతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత చోటుచేసుకుందని కావున 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని తెదేపా ప్రభుత్వం ఏర్పాటు చేసిన మూడు సంవత్సరములలో రాష్ట్రంలో నలమూలలకు త్రాగునీరు, సాగునీరు అందిస్తామని రైతులకు హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎల్ఎల్సి డైరెక్టర్ గడ్డం నారాయణరెడ్డి, సోముల గూడూరు వెంకటరమిరెడ్డి, రైస్ మిల్ నారాయణరెడ్డి, పూలుచింత బండి గురుస్వామి, వడ్డే గోపాల్, బోయ వీరేష్, మస్తాన్ కార్యక్రమంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు తదితరులు గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.