Friday, September 20, 2024
HomeతెలంగాణSuryapeta: గ్రహణం వీడింది ఆధునికీకరణ మొదలైంది

Suryapeta: గ్రహణం వీడింది ఆధునికీకరణ మొదలైంది

జిల్లా కేంద్రంగా రూపాంతరం చెందిన సూర్యాపేట రహదారుల విస్తరణ పనులకు మోక్షం లభించింది. అభివృద్ధిని జీర్ణించుకోలేక కోర్టులంటూ కేసులంటూ చేసిన చిల్లర మల్లర రాజకీయాలకు కోర్టు పులిస్టాఫ్ పెట్టింది. గ్రహణం పట్టిన చంద్రుడిలా ఉన్న రహదారుల విస్తరణకు గ్రహణం వీడడంతో పట్టణ ప్రజల్లో అంబరాన్ని అంటే సంబురాలు వ్యక్తం చేస్తున్నారు. రోడ్ల విస్తరణ తో పాటు జిల్లా కేంద్రంగా రూపాంతరం చెంది జాతీయ రహదారిపై ఉన్న సూర్యపేట పట్టణం సుందరీకరణ కూడా మోక్షం కలుగుతుంది అంటూ వ్యాపార వర్గాల్లో వెల్లి విరుస్తున్న ఆనందం నింగి నంటేలా మారింది. సూర్యపేటను జిల్లా కేంద్రంగా మార్చడంతో పాటు ఊహకందనిది, కలలో కుడా ఉహించనిది మెడికల్ కళాశాల, సమీకృత కలెక్టర్ కార్యాలయ భవనాలు, సమీకృత కూరగాయల మార్కెట్ తో పాటు తాజాగా సమీకృత విద్యుత్ శాఖా కార్యాలయాల ఏర్పాటుతో వ్యాపారం అభివృద్ధి లోకి వస్తుందని వ్యాపారవర్గాలు, వ్యాపారుల వ్యాపారం రావడం వల్ల మున్సిపాలిటికి ఆదాయం పెరిగి మరింత అభివృద్ధి జరుగుతుందంటూ మంత్రి జగదీష్ రెడ్డికి అటు వ్యాపార వర్గాలు ఇటు పట్టణ ప్రముఖులు అభినందనలు తెలిపారు. కోర్టు కేసుల నుండి విముక్తి కలిగిన రహదారుల పనులు వేగవంతం చెయ్యాలని మంత్రి జగదీష్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

- Advertisement -

ఈ మేరకు మున్సిపల్ చైర్మన్ పెరుమాండ్ల అన్నపూర్ణమ్మ, వైస్ చైర్మన్ కిశోర్, కౌన్సిలర్ మొరిశెట్టి శ్రీనివాస్, గ్రంధాలయ సంస్థ అధ్యక్షుడు నిమ్మల శ్రీనివాస్ గౌడ్, ఆర్యవైశ్య సంఘాల ప్రతినిధులు, పట్టణ ప్రముఖులు, కమిషనర్ రామంజుల్ రెడ్డిలతో కలసి ఆయన శుక్రవారం సాయంత్రం పట్టణంలో నీ రహదారుల విస్తరణ పనులను పరిశీలించారు. రాత్రి పగలు అన్న తేడా లేకుండా చేస్తేనే పనులలో పురోగతి ఉంటుందని ఆయన అధికారులకు సూచించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News