Saturday, November 23, 2024
Homeఆంధ్రప్రదేశ్Allagadda: ఎఫ్ఎం రేడియో స్టేషన్ ప్రారంభం

Allagadda: ఎఫ్ఎం రేడియో స్టేషన్ ప్రారంభం

ఆల్ ఇండియా రేడియో ప్రసార భారతి కేంద్రంలో ఎఫ్ఎం రేడియో ప్రసారాల ట్రాన్స్ మీటర్స్ ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆళ్లగడ్డ పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఉన్న నూతన ఆకాశవాణి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. నంద్యాల ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని ఎఫ్ఎం 103 ఫ్రీక్వెన్సీ మీటర్స్ ను ఆకాశవాణి అధికారులతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంపి పోచా బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 91 ఎఫ్ఎం స్టేషన్ ఉండగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ లో రేడియో స్టేషన్ ప్రారంభించడం గర్వకారణమన్నారు. అందుకు దేశ ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర మంత్రులు అనురాగ్ సింగ్ ఠాకూర్ డాక్టర్ ఎల్ మురుగన్ కు కృతజ్ఞతలు తెలిపారు. సమాజాన్ని మంచి మార్గాన్ని నడిపేది రేడియో అని కాలానుగుణంగా టీవీ, సోషల్ మీడియా వచ్చాయని గతంలో రేడియోలో వార్తలు వాతావరణం వ్యవసాయ, రైతులకు సలహాలు సూచనలు జానపద గీతాలు కోసం రేడియో ముందర కూర్చొని వినే వాళ్ళని కొన్ని సంవత్సరాల నుండి రేడియో భారత దేశ ప్రజలకు సేవలు చేసిందన్నారు నేటికి కూడా రేడియోలో వస్తున్న కార్యక్రమాలను గ్రామీణ ప్రాంతంలోని ప్రజలు వింటున్నారని దేశ ప్రధాని మోడీ మనీకి బాత్ కార్యక్రమాన్ని రేడియోలో కొనసాగిస్తున్నారన్నారు. నేటి సమాజానికి రేడియో అవసరమన్నారు. రేడియోకు ఆదరణ ఎప్పటికీ తగ్గదని ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి తెలిపారు.

- Advertisement -

డీఎస్పీ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ గతంలో రేడియో అంటే చెవి కోసుకునే వాళ్ళమని ఆనాడు రేడియో వస్తున్నా వార్తలు క్రికెట్ కామెంట్రీ మధురమైన జానపద గీతాలు భక్తి గీతాలు పాటలు ప్రత్యేకంగా రేడియోలో వార్తలు చదువుతున్న వారి విశేష పరిజ్ఞానం చక్కగా ఉండేదని నాటి రేడియో జ్ఞాపకాలను ఎవరు మర్చిపోలేరని రేడియో కు ఒక విశిష్టతమైన స్థానం ఉందన్నారు తిరిగి రేడియో కార్యక్రమాలను వినడానికి ఆసక్తిగా ఉంటుందని డిఎస్పి సుధాకర్ రెడ్డి తెలిపారు. కమిషనర్ ఏవి రమేష్ బాబు మాట్లాడుతూ ఆల్ ఇండియా రేడియో ఆకాశవాణి నాడు ఒక మధురమైన ఘట్టంగా భావించారని తిరిగి ఇలాంటి కార్యక్రమాలను రేడియో ద్వారా శ్రోతలకు రేడియో సేవలు రావడం ఒక మంచి పరిణామమని కమిషనర్ రమేష్ బాబు తెలిపారు. సీఐ జీవన్ గంగా నాద్ బాబు, రామ్మోహన్ రెడ్డి విజయవాడ డిడి జి సోమేశ్వరరావు డి ఈ ఈ పి వీరభద్రుడు, ఏ డి ఈ చంద్రశేఖర్ రెడ్డి ఆకాశవాణి విశిష్టతను గురించి ప్రసంగించారు. అనంతరం అతిథులను ఆల్ ఇండియా రేడియో అధికారులు సన్మానించారు ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సుబ్బారెడ్డి కౌన్సిలర్ గురుమూర్తి ఎస్సైలు సత్యనారాయణ వెంకట్ రెడ్డి ఆల్ ఇండియా రేడియో టెక్నీషియన్లు ఆదినారాయణ రెడ్డి రత్నరాజు మురళి నాగేశ్వర్ రెడ్డి నాగేశ్వరరావు వైకాపా నాయకులు డాబా మనోహర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News