Beauty Tips: ఈ జాగ్రత్తలు పాటిస్తే.. నిత్య యవ్వనం మీ సొంతం!

కాలుష్యం, ఒత్తిడి, పోషకాహార లోపం వంటివి చిన్నవయసులోనే చర్మం ముడతలు రావటానికి కారణం.

మోతాదుకు మించిన షుగర్ వాడకం వల్ల చర్మం మృదుత్వాన్ని కోల్పోతుంది. కాబట్టి షుగర్‌ను తగ్గించాలి.

ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు చర్మ ఆరోగ్యానికి సహకరిస్తాయి. అందుకే ఫిష్ తినాలి.

రోజూ ఒకే దిశలో, చెంపలను దిండుకి ఆనించి నిద్రపోకూడదు.

చర్మతత్వాన్ని బట్టి సబ్బు ఎంచుకోవాలి. లేదంటే ముఖం పొడిబారి, ముడతలు పడతాయి.

విటమిన్-సి ఉన్న పండ్లు, కూరగాయలు తీసుకోవాలి.

క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే, రక్తప్రసరణ మెరుగుపడి, చర్మానికి కాంతి వస్తుంది.