Friday, September 20, 2024
Homeనేషనల్Mine Collapse : ఛత్తీస్ ఘడ్ లో ఘోర ప్రమాదం.. గని కూలి 7గురి మృతి

Mine Collapse : ఛత్తీస్ ఘడ్ లో ఘోర ప్రమాదం.. గని కూలి 7గురి మృతి

ఛత్తీస్ ఘడ్ లో ఘోర ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు గని కూలి ఏడుగురు కూలీలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మాలగావ్ లోని గనిలో శుక్రవారం ఈ ప్రమాదం జరిగింది. మృతుల్లో ఒక పురుషుడు, ఆరుగురు మహిళలు ఉన్నారు. మరో 15 మందికి పైగా కూలీలు శిథిలాల్లో చిక్కుకున్నారు.

- Advertisement -

గనిలో తవ్వకాలు జరుగుతున్న సమయంలో.. అకస్మాత్తుగా ఈ ప్రమాదం జరిగినట్లు ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు. సమచారం తెలుసుకున్న పోలీసులు, ఎన్ డీఆర్ఎఫ్ టీమ్ ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటికి తీసేందుకు ప్రొక్లెయినర్ తో తవ్విస్తున్నారు. గని కూలడంతో అధికారులు సమీప ప్రాంతంలోని రెండు గ్రామాల ప్రజలను తాత్కాలికంగా ఖాళీ చేయించి, పునరావాసాలకు తరలిస్తున్నారు. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరగవచ్చని తెలుస్తోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News