శీతాకాలం దొరికే అద్భుతమైన పండ్లలో సీతాఫలం ఒకటి. ఇవి సెప్టెంబరు నుంచి డిసెంబరు మధ్య ఎక్కువగా లభిస్తాయి

ఎంతో రుచికరంగా ఉండే సీతాఫలాలు ఆరోగ్యానికీ ఎంతో అవసరం.

ఇందులో ఎ, సి, బి6 వంటి విటమిన్లు, ఖనిజాలతో పాటు కాపర్, పొటాషియం, పీచు పుష్కలంగా లభిస్తాయి

పైగా ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది కూడా. చాలా బలహీనంగా ఉన్న వారిలో శక్తిని అమాంతం పెంచుతుంది.

ఇందులో ఉండే మెగ్నీషియం కండరాలకు విశ్రాంతినివ్వడానికి తోడ్పడుతుంది. గుండె సంబంధిత సమస్యలు రాకుండా కాపాడుతుంది.

సీతాఫలం తింటే శరీరానికి చలువ చేయడంతో పాటు రక్తహీనత సమస్య నుంచి రక్షిస్తుంది

ఆహారం త్వరగా జీర్ణం కావట్లేదా? అయితే సీతాఫలంలోని కాపర్ ఆహారం త్వరగా జీర్ణమవడంలో సహాయపడుతుంది

అయితే శీతాఫలం ఆరోగ్యానికి ఎంత మేలు చేసిన దాని విత్తనాలు మాత్రం ఆరోగ్యానికి హాని కలిగాస్తాయి

అనుకోకుండా ఒకటి, రెండు సీతాఫలం గింజలు తింటే ఏమీ కాదు. ఎక్కువ మొత్తంలో మింగితే మంచిది కాదు

ముఖ్యంగా శీతాఫలం విత్తనాలు తినడం వల్ల కళ్ళకు, అంటే దృష్టికి తీవ్రమైన నష్టం జరుగుతుంది.